Wood Pressing Oil : కల్తీలేని కట్టెగానుగ నూనె తయారీ

గానుగ నూనెలు.. తరతరాలుగా వస్తున్న నూనెలు. వీటిని సహజంగా తయారు చేస్తారు. గానుగ నూనెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెరుగుతోంది.

Wood Pressing Oil : కల్తీలేని కట్టెగానుగ నూనె తయారీ

Ganuga Nune

Wood Pressing Oil : ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం.. ఈ రెండు విషయాల చుట్టూనే ఇప్పుడు మనిషి జీవితం నడుస్తోంది. ఆరోగ్యకరమైనదే తింటున్నామా? ఏది తింటే మంచిది? ఇంతకంటే మంచివి ఇంకేం తినొచ్చు.. ఇట్లాంటి ప్రశ్నలే బుర్ర నిండా తిరుగుతున్నాయి. డాక్టర్లు కూడా మందుల కంటే ఎక్కువగా తిండి విషయంలోనే దృష్టిపెట్టాలని జనాలకు సలహాలు ఇస్తున్నారు.

READ ALSO : Organic Oil : గానుగ నూనె తయారీ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న వాసాలమర్రి యువకుడు

అందుకే మళ్ళీ పాతకాలపు వంటలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల కాలంలో ముఖ్యంగా గానుగ నూనెకు పెరిగిన డిమాండ్ ను చూసి చాలా మంది గానుగ నూనెల తయారీ ఉపాధి పరిశ్రమగా ఎంచుకున్నారు.

ఆరోగ్యం కోసం ప్రజలు ఇప్పుడు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. ముఖ్యంగా కోవిడ్ టైం నుండి గ్రోసరీ స్టోర్లలో షెల్ఫ్ ల నిండా హెల్త్ కేర్ ప్రొడక్టులు అధికంగా కనిపిస్తున్నాయి. మరి ఇళ్లలో వాడే వంట నూనెల సంగతి ఏంటి.. ఆహారంలో తృణ ధాన్యాల మోతాదు పెరిగినట్లే, ఇప్పుడు గానుగ నూనెలకు క్రేజ్ వచ్చింది. మునుపటి తరాలు వాడిన ఈ నూనెలతో ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం జనాల్లో రోజురోజుకీ పెరుగుతోంది.

READ ALSO : Ganuga Oil : గానుగ నూనెతో లాభాల బాట..

రిఫైన్డ్ ఆయిల్స్ తో పోలిస్తే గానుగ నూనెల ధర చాలా ఎక్కువ. అయినా కూడా డోంట్ కేర్ అంటూ కొనుక్కుంటున్నారు. అందుకే చాలా మంది యువకులు గానుగనూనెల యూనిట్లను ఏర్పాటుచేసి ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు మల్కాజ్ గిరిలో గానుగ యూనిట్ ఏర్పాటుచేసి నూనె ఉత్పత్తి చేస్తూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు.

గానుగ నూనెలు.. తరతరాలుగా వస్తున్న నూనెలు. వీటిని సహజంగా తయారు చేస్తారు. గానుగ నూనెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే గానుగ నూనెల తయారీ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి.