IPL-2020కు ముందే ఆఫర్ : Reliance Jio టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్లు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐపీఎల్ 2020 సీజన్ మొదలవుతుంది.. ఐపీఎల్ హంగామా కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పుణ్యామని.. ఇప్పుడంతా ఐపీఎల్ మ్యాచ్‌లు ఇంట్లో ఫోన్లలో, టీవీల్లో చూడాల్సిందే.. అందుకే ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ల కింద డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్ర్కిప్షన్ ఒక ఏడాది వరకు ఉచితంగా పొందవచ్చు. ఈ ఓటీటీ ప్లాట్ ఫాంపై ఐపీఎల్ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఇంతకీ రిలయన్స్ జియో అందించే ఆ ఐదు టాప్ ప్రీపెయిడ్ ప్లాన్లలో ముందుగా రూ.401, రూ.598 ప్లాన్, రూ.777 ప్లాన్, రూ. 499 ప్లాన్, చివరిగా రూ.2,599 ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఒక్కో ఆఫర్‌లో డేటా బెనిఫెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

1. రూ. 401 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద జియో ప్రతిరోజు 3GB డేటాను ఆఫర్ చేస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఒక ఏడాది పాటు Disney+ Hotstar VIP సబ్ స్ర్కిప్షన్ కూడా అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది.2. రూ. 598 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద జియో 56 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. రోజుకు 2GB డేటాను ఆఫర్ చేస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తోంది. Disney+ Hotstar VIP ఏడాది పాటు సబ్ స్ర్కిప్షన్ కూడా ఆఫర్ చేస్తోంది.

3. రూ.777 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద జియో యూజర్లు ప్రతిరోజు 1.5GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.. అలాగే ఒక ఏడాది వరకు Disney+ Hotstar పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజుల వరకు ఉంటుంది.4. రూ.2,599 ప్లాన్ :
ఈ ప్లాన్ కింద ప్రతిరోజు 2GB డేటాను ఆఫర్ చేస్తోంది.. 365 రోజుల వరకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.. అలాగే ఒక ఏడాది వరకు Disney+ Hotstar VIP సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.

5. రూ. 499 ప్లాన్ :
రిలయన్స్ జియో అదనంగా డేటా ప్లాన్ అందిస్తోంది.. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న యూజర్లు రోజుకు 1.5GB డేటా పొందవచ్చు. 56 రోజుల వ్యాలిడితో అందిస్తోంది.. అదనంగా ఏడాది పాటు Disney+ Hotstar VIP సబ్ స్ర్కిప్షన్ కూడా ఆఫర్ చేస్తోంది.

READ  జియో ఫస్ట్ షో ఆఫర్ : ప్రతి వీకెండ్ ఓ బ్లాక్ బస్టర్ మూవీ

Related Posts