బెంగాల్ లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Congress, Left parties to jointly organise programmes పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం అధిష్ఠానం వ్యూహరచన చేస్తోన్న కాంగ్రెస్…నవంబర్-23నుంచి 23 నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.మంగళవారం జరిగిన కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్​-వామపక్షాల కూటమి గురించి ప్రజలకెలా అవగాహన కల్పించాలనే విషయాలను చర్చించేందుకు నాయకులు మంగళవారం సమావేశం అయ్యారు.ఈ కూటమి చాలా శక్తివంతమైనదని,తృణముల్ కాంగ్రెస్,భారతీయ జనతాపార్టీల నుంచి బెంగాల్ ప్రజలకు ప్రత్యామ్నాయ ఆఫ్షన్ ఇచ్చేందుకు ఈ కూటమి కెమిస్ట్రీ బెంగాల్ లోని క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ కి చేరుకోవాలని వెస్ట్ బెంగాల్ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయని, వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపింది.

Related Tags :

Related Posts :