8ఏళ్ల చిన్నారిపై లైంగికవేధింపులు..బుగ్గలు రక్తం వచ్చేలా కొరికేసిన 55 ఏళ్ల కిరాణాషాపు యజమాని

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Ahmedabad 55 year old shop Owner 8 year girl Sexuval herasment : చాక్లెట్ కొనుక్కోవటానికి కిరాణా షాపుకు వెళ్లిన ఎనిమిది సంవత్సరాల చిన్నారిని లైంగికంగా వేధింపులతో హింసించాడు 55ఏళ్ల షాపు యజమాని. మనుమరాలి వయస్సున్న ఆడబిడ్డను ముద్దు చేయటం సాధారణమే. కానీ ముద్దు చేసే నెపంతో కామంతో కొవ్వెక్కిన కిరాణాషాపు యజమాని హింసకు చిగురుటాగులా వణికిపోయిందా చిట్టిపాప. గురువారం (అక్టోబర్ 22,2020)న గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని రాఖియల్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై షాపు యజమాని రాజ్ అహ్మద్ షేక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.


షాపు యజమాని చేసిన పనితో భయపడిపోయిన ఆ పాప ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. కూతురు ఏడవటాన్ని గమనించిన బిడ్డ వాలకం చూసి తల్లడిల్లిపోయింది. పాప లేత బుగ్గలు కందిపోయి రక్తం చారికలు కనిపించటంతో తల్లి భయపడిపోయింది. ‘‘ఏం జరిగిందమ్మా? అని అడిగింది. దానికి ఆ చిన్నారి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు.


ఏడుస్తూనే వెక్కుకుంటూ ‘‘అమ్మా మరే ఆ షాపులో అంకుల్ నన్ను లోపలికి తీసుకెళ్లి ఏమేమో చేశాడు. నా బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా ఏంటేంటో చేశాడు..నా బుగ్గలు కొరికేశాడమ్మా..నొప్పిగా ఉందమ్మా’’ అని చెప్పేసరికి ఆ తల్లి గుండెలు అవిసిపోయాయి. బిడ్డను నఖశిఖ పర్యంతం తడిమి తడిమి చూసుకుంది.


కానీ తన చిన్నారిని అంతలా హింసించిన ఆ షాపు యజమానిపై ఆగ్రహం తగ్గలేదు. భర్తకు కూతురు పరిస్థితి చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయంచెప్పాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరాణా షాపు యజమానిని అరెస్టు చేసి లైంగిక వేధింపుల కేసును భారత శిక్షాస్మృతి సెక్షన్ 354 ఎ (ఐ) కింద నమోదు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లలను నిరోధించే చట్టం కింద అభియోగాలు కూడా అతనిపై ఉన్నాయి. అతన్ని అరెస్టు చేశారు.

Related Tags :

Related Posts :