UP aids patient recover from corona virus with in one week

కరోనా నుంచి కోలుకున్న ఎయిడ్స్ పేషెంట్..!అదీ ఆరురోజుల్లోనే!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎయిడ్స్ ఉన్న రోగికి కరోనా సోకి కేవలం ఆరు రోజుల్లో కోలుకున్నాడు. ఇది చాలా చాలా సంతోషించాల్సినవిషయం. అలాగే ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా. అటువంటిదే జరిగింది యూపీలో.

ఏదైనా తీవ్రమైన వ్యాధితో ఉన్నవారికి కరోనా సోకితే..కోలుకోవటం చాలా చాలా కష్టం. అటువంటివాళ్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎయిడ్స్ క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు ఉన్నవారు కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచి౦చింది. ప్రపంచం వ్యాప్తంగా జరిగిన కరోనా మరణాల్లో  ఇతర రోగాలు ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో అతి ప్రమాదకరమైన ఒక ఎయిడ్స్ పేషెంట్ మాత్రం కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎయిడ్స్ అంటే రోగ నిరోధక శక్తి మీద దెబ్బ కొట్టేది. అటువంటిది ఎయిడ్స్ ఉన్న వ్యక్తి కరోనానుంచి  కేవలం ఆరు రోజుల్లోనే బయటపడ్డాడు. 

వివరాల్లోకి వెళితే..ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ నుంచి స్వస్థలమైన గోండాకు వెళ్ళాడు. మార్గ మధ్యలో ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని తలకు పెద్ద గాయం అయింది. వెంటనే అతణ్ని లక్నోలోని కేజీఎంయూ ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం కరోని విభృంభిస్తున్న క్రమంలో హాస్పిటల్ కు వచ్చినవారికి ఫస్ట్ కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. అలాగే అతనికి కూడా చికిత్స చేస్తూనే కరోనా పరీక్షలు చేశారు. ఈక్రమంలోనే అతను డాక్టర్లకు అసలు విషయం చెప్పాడు. తాను అప్పటికే హెచ్‌ఐవీ మందులు వాడుతున్నానని చెప్పాడు. 

కరోనా పరీక్షల్లో అతనికి పాజిటివ్ అని రావడంతో డాక్టర్లు అతను కోలుకోవటం కష్టమని అనుకున్నాడు. ట్రీట్ మెంట్ మాత్రం రెండు చికిత్సలు చేసారు. అతణ్ని చూసిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. తలకు అంత పెద్ద బలమైన గాయం అయినా సరే అతను ఎక్కడా కంగారు పడలేదు..సరికదా..అతని శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. 

తని శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండటంతో ఎయిడ్స్ తీవ్రత కూడా అతనికి పెద్దగా లేదని పైగా కరోనా సోకినాసరే వెంటనే కోలుకున్నాడని హాస్పిటల్  వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెస‌ర్ ఎం.ఎల్‌.బి భట్ మీడియాకు తెలిపారు. అందరూ ఇతనిలా ధైర్యంగా ఉంటే ఏ వ్యాధిగానీ..ఏ వైరస్ గానీ ఏమీ చేయలేదని అన్నారు.

Related Posts