5 రూపాయల ఖర్చుతో ఈ బైక్‌లో 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రోజురోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెరిగిపోతూ ఉండగా.. మోటార్ వాహనాలపై వెళ్లాలంటే జేబుల్లో డబ్బులు మాయం అయిపోతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుతున్న ధర ప్రజల బడ్జెట్‌ను పాడుచేస్తున్న సమయంలో దేశంలో గాలితో నడిచే బైక్ చర్చనీయాంశంగా మారింది. ఈ బైక్‌క సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేక బైక్ వాయు పీడనంతో నడుస్తుంది. ఈ బైక్‌లో గాలిని నింపడం ద్వారా 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.గాలి ద్వారా నడుస్తున్న ఈ బైక్‌ను స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ డైరెక్టర్ జనరల్ భారత్ రాజ్ సింగ్ సిద్ధం చేశారు. లక్నోకు చెందిన ఆయనే ఈ సరికొత్త బైక్‌ను తయారుచేశారు. ఈ బైక్‌లోని సిలిండర్‌లో గాలి నింపాలని ఆయన చెప్పారు. సాధారణ గాలిని సిలిండర్‌లో నింపితే బైక్ నడుస్తుందని ఆయన వెల్లడించారు. ఈ బైక్‌లో గాలి నింపడానికి అయ్యే ఖర్చు 5 రూపాయలు మాత్రమే. అయితే ఇందులో 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని వేగం గంటకు 70నుంచి 80 కి.మీ వరకు ఉంటుంది.


ప్రజలు ఈ కొత్త రకం బైక్‌ను బాగా ఇష్టపడతారని అంటున్నారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయిన ఇటువంటి సమయంలో ఈ బైక్ ఒక వరం అని అంటున్నారు. భారత్ రాజ్ సింగ్ మాట్లాడుతూ, ‘2008 లో పేటెంట్ కోసం పంపించాను. దీనికి పేటెంట్ ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ బైక్ మేక్ ఇన్ ఇండియా కింద విస్తరించబడుతుంది. అని ఆయన చెప్పారు.
Related Posts