లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

ఆపరేషన్ “కరోనా వ్యాక్సిన్”…సిద్దమవుతోన్న విమాన సంస్థలు,విమానాశ్రయాలు

Published

on

Operation Covid Vaccine మరో-3-4 నెలల్లో ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ సిద్దమవుతుందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ప్రకటించిన విషయం తెలిసిందే.2021మనందరికీ 2021 మంచి ఏడాదిగా ఉంటుందని ఆశిస్తున్నాను అని హర్షవర్థన్ అన్నారు. వ్యాక్సిన్‌ రాగానే ముందుగు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపైనా భారీ కసరత్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ రెడీ అయిన తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందించేందుకు భారతీయ ఎయిర్ లైన్స్ మరియు ఎయిర్ పోర్ట్ లు సిద్దమయ్యాయి. “ఆపరేషన్ కోవిడ్ వ్యాక్సిన్” కొరకు భారతీయ విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.“ఆపరేషన్ కరోనా వ్యాక్సిన్” పేరుతో సాగుతున్న ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలంటే భారీ కసరత్తు అవసరమవుతోంది. ఇందు కోసం ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరక రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటు పూర్తయింది. ఈ కమిటీల సాయంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే క్రమంలో వ్యాక్సిన్‌ను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా విమానయాన సంస్ధలు, విమానాశ్రయాలు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.ఆక్స్‌ఫర్డ్ సిద్దం చేస్తున్న కరోనా వ్యాక్సిన్ “పిఫిజిర్” అందుబాటులోకి‌ రాగానే దేశ వ్యాప్తంగా శరవేగంగా దాన్ని పంపిణీ చేసి రోగులకు అందించాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్యమైతే టీకా వికటించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే టీకాను మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేయడంతో పాటు దీన్ని వివిధ ప్రాంతాలకు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ ను కోల్డ్‌ స్టోరేజీలతో పాటు విమానాల్లో పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విమానయాన సంస్దలతో పాటు విమానాశ్రయాలు నడుపుతున్న ఆపరేటర్లు కూడా ఈ భారీ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు.ఇక, హైదరాబాద్‌, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న GMR గ్రూప్ కూడా ఈ ప్రక్రియలో కీలకమవుతోంది. హైదరాబాద్,ఢిల్లీ రెండు చోట్లా తమకున్న ఎయిర్ కార్గో యూనిట్లు వాక్సిన్ సరఫరా లో కీలక పాత్ర పోషించేందేకు సిద్దమవుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే జీఎంఆర్‌ ప్రత్యేక కార్గో యూనిట్లను సిద్ధం చేయడంతో పాటు వీటిలో ప్లస్‌ 25 డిగ్రీల నుంచి మైనస్‌ 20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది.స్పైస్ జెట్‌ కార్గో విభాగంతో పాటు స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇందులో భాగస్వాములవుతున్నాయి. వీరిద్దరూ కలిసి గ్లోబల్‌ కోల్డ్‌ చైన్‌ సంస్ధతో భాగస్వాములై ఈ వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 25 డిగ్రీల సెల్సియస్‌ నుంచి మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వరకూ కోల్డ్‌ చైన్‌ నిర్వహించిన అనుభవం ఈ సంస్ధకు ఉంది. దేశంలోని మిగతా ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌లైన్ సంస్ధలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *