aishno Devi Yatra Suspended Amid Coronavirus Outbreak

వైష్ణోదేవి యాత్ర నిలిపివేత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బుధవారం(మార్చి-18,2020)నుంచి వైష్ణోదేవి యాత్రను నిలిపివేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌కి రాకపోకలు సాగించే అన్ని అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను కూడా నేటి నుంచి  రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా భక్తులు తమ దర్శనాలను వాయిదా వేసుకోవాలని శ్రీమాత వైష్ణోదేవి ఆలయ బోర్డు విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా చికిత్స పొందుతూ  ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 

Also Read | కరోనా బాధితుల మెనూ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో దోసె, గుడ్లు, ఆరెంజ్ పంపిణీ! 

Related Posts