అమితాబ్..అభిషేక్‌లతో పాటు ఐశ్వర్యరాయ్‌కు కరోనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అతని కొడుకు అభిషేక్ బచ్చన్‌లతో పాటు కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనమరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అమితాబ్, అభిషేక్ లను హాస్పిటల్ కు తరలించగా, ఐశ్వర్య, ఆరాధ్యలలో లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఐశ్వర్య, ఆరాధ్యలు ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి రాతపూర్వకంగా అనుమతి అడగాలని తెలిపింది.

నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న అమిత్ ఆరోగ్యం కుదుటగానే ఉందని, కొద్దిపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ప్రస్తుతం ఐసోలేషన్ యూనిట్ లో ఉంచినట్లు చెప్పారు. శనివారం అమితాబ్ టెస్ట్ చేయించుకున్నానని పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. దాంతో పాటు తనతో క్లోజ్ గా ఓ 10రోజుల నుంచి తిరిగిన వారంతా టెస్టు చేయించుకోవాలంటూ సూచించారు.

ఈ మేరకు బచ్చన్ కుటుంబానికి చెందిన నాలుగు బంగ్లాలు జల్సా, జనక్, ప్రతీక్షా, వాత్సలను సీల్ చేసినట్లు అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ విశ్వాస్ మోటె అన్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా నిర్ణయించారు. స్టాఫ్ సభ్యులందరికీ టెస్టులు చేస్తున్నాం. ఇప్పటి వరకూ 30మందికి పాజిటివ్ గా తేల్చామని అన్నారు.

బచ్చన్ కుటుంబానికి చెందని 16మందికి టెస్టులు చేశారు. ఇందులో గార్డ్ లు, పనివారు కూడా ఉన్నారు. మిగిలిన రిపోర్టులు రేపటికి వస్తాయని అడిషనల్ కమిషనర్ సురేశ్ కాకాని అన్నారు. ఐశ్వర్య, ఆరాధ్య ఇంటి దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోవాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జయాబచ్చన్ కు నెగెటివ్ అని తేలింది.

Related Posts