హోమ్లీ నుంచి హాట్ లుక్‌లోకి.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నారు. నచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెడుతూ కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. కొందరు కథానాయికలు ఫొటోషూట్లు కూడా చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఐశ్వర్యా రాజేష్ చేసిన ఫొటోషూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Aishwarya Rajesh

దివంగత నటుడు రాజేష్ కూతురు ఐశ్వర్యా రాజేష్ తన ఆరేళ్ల వయసులో రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2010లో తమిళనాట కథానాయికగా తెరంగేట్రం చేసి పలు విజయవంతమైన సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి, మిస్‌మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాల్లో నటించింది. ఐశ్వర్యా రాజేష్ చాలా వరకు సహజంగా కనిపించే డీ గ్లామర్ రోల్సే చేసింది. ముఖ్యంగా ‘కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాల్లో ఆ తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ విజయ్ దేవరకొండ శ్రీను క్యారెక్టర్ భార్య సువర్ణగా గృహిణి పాత్రలో ఆమె నటించిన తీరుకి ప్రశంసలు లభించాయి. అటువంటి హోమ్లీ ఇమేజ్ ఉన్న ఐశ్వర్యా రాజేష్ సడెన్‌గా రూటు మార్చింది. మారుతున్న కాలాన్నిబట్టి మనమూ మారాలి అందులోనూ ఇలాంటి గ్లామర్ ఫీల్డ్‌లో అది ఇంపార్టెంట్ అనే విషయం కాస్త ఆలస్యంగానైనా అర్థమైనట్టుంది. ఇదే అదనుగా భావించి తనలోని గ్లామర్ యాంగిల్‌ బయటకు తీసింది. హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కించింది.

తాజా ఫొటోషూట్‌లో Gold and Pearl వేర్ ధరించి కసిగా కవ్విస్తూ కనిపిస్తూ.. కేవలం హోమ్లీ క్యారెక్టర్సే కాదు మోడర్న్ క్యారెక్టర్స్‌లోనూ అదరగొడతాను.. అవకాశం ఇచ్చి చూడండి చూపిస్తా.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటూ దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చింది ఐశ్యర్యా రాజేష్.. అమ్మడిలోని ఈ కొత్త యాంగిల్ చూసి ముందుగా ఎవరు ఆఫర్ ఇస్తారో చూడాలి మరి.

Credit:@aishwaryarajessh

Related Posts