గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఐశ్వర్య, నిఖిల్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Aishwarya Rajessh: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ మహత్తర కార్యక్రమంలో సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు.


తాజాగా హీరో సుశాంత్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించారు నటి ఐశ్వర్య రాజేష్‌. ‘కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్‌ లవర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్‌.. మంగళవారం హైదరాబాద్‌ మాదాపూర్‌లో మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ముద్దుగుమ్మలు..

Image

మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యం. రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుంది. కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి, మనం పీల్చుకునే ఆక్సిజన్‌ను మనమే పెంచుకోవాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ గారికి కృతజ్ఞతలు.Imageఈ ఛాలెంజ్‌లో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ ఛాలెంజ్‌ ఇదే విధంగా కొనసాగాలని కోరుతూ.. నా అభిమానులు, స్నేహితులు.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటి.. ఆ ఫొటోలను పంపిస్తే.. వాటిని నేను షేర్ చేస్తాను..’’ అన్నారు.Imageనటుడు రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందగా ఉందని.. అందరూ విధిగా మొక్కలు నాటాలని కోరిన నిఖిల్.. 18 పేజెస్ మూవీ టీమ్, కలర్స్ స్వాతి, అవికా గోర్, అనుపమ పరమేశ్వరన్‌లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు.

ImageImage

Related Tags :

Related Posts :