లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

చీప్ స్టార్ ఎవరు : అజయ్ భూపతి ట్వీట్

Published

on

Ajay Bhupathi Tweet Cheap Star Viral

RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చీప్ స్టార్ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై వైరల్ అయ్యింది. ఎవరిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారనే దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏ హీరో అంటూ చర్చించుకుంటున్నారు. ఫుల్ క్లారిటీ వచ్చేదాక దీనిని వదిలేలా కనిపించడం లేదు. 
ఆర్ ఎక్స్ 100 చిన్న సినిమా తీసిన అజయ్..పెద్ద హిట్ అందుకున్నాడు.

బోల్డ్ సీన్స్, లిప్ కిస్‌లు ఉన్న ఈ సినిమా తర్వాత..నెక్ట్స్ సినిమా ఏదీ ఫైనల్ చేయలేదు. చీప్ స్టార్ అంటూ చిన్న ట్వీట్ పెద్ద దుమారం రేపుతోంది. మహాసముద్రం అనే కథ రాసుకున్నట్లు..స్క్రిప్ట్ వినిపించేందుకు పలువురు దగ్గరకు ఆయన వెళుతున్నట్లు తెలుస్తోంది. రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు వినిపించాయి. అయితే..రవి తేజ ఒకే చెప్పి..ప్రాజెక్టును ఆలస్యం చేస్తూ వచ్చాడనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరి పేరు చెప్పకుండా..ఏ అంశాన్ని ప్రస్తావించకుండా చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. మరి అజయ్ భూపతి ఏ స్టార్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశారో తెలియడం లేదు. 
Read More : అతిలోక సుందరి : శ్రీదేవి మైనపు విగ్రహం ఆవిష్కరణ
అజయ్ భూపతి..రాంగోపాల్ వర్మ శిష్యుడు. కొన్ని సందర్భాల్లో వర్మను విమర్శించడం..పొగిడేయడం చేశారు. ఆర్ ఎక్స్ 100 సినిమాపై వర్మ అప్పట్లో ట్వీట్ చేశారు. చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తోందని..డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, హీరో కార్తికేయకు కంగ్రాట్స్..సినిమా ఓపెనింగ్స్, ప్రేక్షకుల స్పందన బాగుందంటూ వర్మ ట్వీట్ చేశారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *