లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

హిందీ ‘ఖైదీ’ అజయ్ దేవ్‌గణ్

కార్తి నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవ్‌గణ్..

Published

on

Ajay Devgn to play lead in Hindi remake of Kaithi

కార్తి నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవ్‌గణ్..

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం రీమేక్స్, బయెపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. పలు తెలుగు సినిమాలో హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో తమిళ సినిమా హిందీలో రీమేక్ కానుంది. యాంగ్రీ హీరో కార్తి నటించిన తమిళ సినిమా.. ‘ఖైదీ’..

‘మా నగరం’ సినిమాతో ప్రేక్షకలను అలరించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఖైదీ’ పేరుతో గతేడాది దీపావళికి తెలుగులోనూ విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లో ప్రముఖ బాలీవుడ్ కథనాయకుడు అజయ్ దేవ్‌గన్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్స్ కలిసి నిర్మంచనున్నాయి. 2021 ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దర్శకుడితో సహా ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. అజయ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాడు. హిందీలో నటిస్తున్న ‘మైదాన్’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *