పంద్రాగష్టుకు ‘మైదాన్’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఒక కోచ్ నిజ జీవిత కథగా ‘మైదాన్’ తెరకెక్కుతోంది. జీవితంలో అయినా, ఆటలోనైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తివంతమైన కథగా ‘మైదాన్’ ను నిర్మిస్తున్నారు.

Maidaan

‘బధాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ ఆగింది. అయితే త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాది ఆగస్ట్ 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Read:వర్మపై కేసు నమోదు చేయాలని నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశం..

Related Posts