Home » టెస్టు కెప్టెన్ రహానెకు గ్రాండ్ వెల్కమ్..
Published
1 month agoon
Ajinkya Rahane: కంగారూల గడ్డపై టీమిండియా ఘనకార్యమే చేసింది. గబ్బా స్టేడియంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను మట్టికరిపించడమే కాకుండా.. గాయాల బెడదతో సతమతమవుతోన్న జట్టును విజయతీరాలకు చేర్చాడు రహానె. బ్యాటింగ్ విభాగం బలహీనపడిన సమయంలో జట్టులో స్ఫూర్తిని నింపి బౌలింగ్ ప్రధాన ఆయుధంగా సంధించి గెలిచి చూపించాడు.
ఫలితంగా 2-1తేడాతో సిరీస్ ను గెలుచుకున్న టీమిండియాకు ఇండియా చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో కెప్టెన్ అంజిక్య రహానెకు ముంబైలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అపూర్వ విజయయంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫిని దక్కించుకున్న రహానేకు ముంబైలోని అభిమానులు, స్థానికులు కూడా ఘన స్వాగతం పలికారు. గురువారం ముంబైలోని ఆయన నివాసానికి తిరిగివచ్చిన తరుణంలో బాండ్ బాజాలతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన రహానెపై కుమార్తె ఆర్యను ఎత్తుకుని ఉండగానే పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రహానె భార్య రాధిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన అజింక్య రహానే నేతృత్వంలోని యంగ్ ఇండియా అద్భుతమైన విజయం సాధించింది.
టీమిండియా మరో నలుగురు సభ్యులతో కలిసి రహానె ఆస్ట్రేలియా నుండి ముంబై చేరుకున్నారు. కాగా రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను 2014 సెప్టెంబర్ 26న ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
కోహ్లీనే మా కెప్టెన్.. మసాలా కోసం మాట్లాడొద్దు: రహానె
రిటైర్ అయిన సైనికుడిని అరచేతులపై నడిపిస్తూ ఇంటికి తీసుకొచ్చిన గ్రామస్తులు..‘సెల్యూట్ సైనికా’అంటూ ఘన స్వాగతం
మళ్లీ ఏమైంది: రోహిత్, రహానెలతో పాటు మరో ముగ్గురికి హోం క్వారంటైన్..?
రిషబ్ పంత్ డీఆర్ఎస్ రిక్వెస్ట్‌కు నవ్వేసుకున్న రహానె, రోహిత్ శర్మ
భారత ఆటగాళ్లకు గాయాలే..గాయలు
‘రహానె వ్యూహం అద్భుతం’.. ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు