అతను నాకు కొడుకు లాంటి వాడే: అక్కినేని అమల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజీత్.. తర్వాత పెద్దగా పేరొచ్చే పాత్రల్లో అయితే కనిపించలేదు. కానీ బిగ్‌బాస్ తెలుగు 4వ సీజన్‌లో ఎంట్రీతో ఒక్కసారిగా జనాల్లో హైప్ తెచ్చుకున్న అభిజీత్.. హౌస్‌లో బెస్ట్ పెర్ఫామర్‌గా సాగుతున్నారు. ఫస్ట్ నుంచి స్మార్ట్ గేమర్‌గా అభిజిత్‌ను భావించినా.. ఫిజికల్ టాస్క్‌లలో మాత్రం వీక్ అనే కామెంట్స్ వినిపించాయి.కానీ, ఫిజికల్ టాస్క్‌లలో పేరు తెచ్చుకుని బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. ఇతని పేరుతో ఆర్మీలు.. గ్రూప్‌లు, పేజీలు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున వైఫ్ అక్కినేని అమల కూడా అభిజీత్ గురించి పాజిటీవ్‌గా మాట్లాడారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో తల్లిగా చేసిన అమల.. అభిజీత్ అప్పుడు చాలా చిన్న కుర్రాడని.. అప్పుడే B.Tech పూర్తి చేసి, సినిమాల్లోకి వచ్చాడని, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చింది.


షారుఖ్ ఖాన్ ఇంట్లో ఒక రోజు ఉండే అవకాశం


తనకు నిజంగానే అభి కొడుకు లాంటి వాడని తెలిపింది. పెద్దలతో చాలా మర్యాదగా ఉంటాడని, షూటింగ్‌ సమయంలో తనను నిజంగా అమ్మలాగే చూసుకున్నాడని తెలిపింది. తన మాదిరే అభిజీత్‌కు కూడా మూగ జీవాలంటే ఇష్టమని.. అందుకే ఇద్దరం కనెక్ట్ అయ్యినట్లు అమల చెప్పింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అభిజీత్‌కు అమ్మ పాత్రలో నటించింది అమల అక్కినేని. ఆ షూటింగ్ సమయంలో చాలా క్లోజ్ అయిపోయారు అమల, అభి. ఈ సినిమా కోసం ఇద్దరూ నెల రోజులు కలిసి పనిచేశారు.

Related Tags :

Related Posts :