తెలంగాణ CM సహాయనిధికి ‘కింగ్’ నాగార్జున 50 లక్షల విరాళం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Akkineni Nagarjuna: తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రముఖ సినీ నటుడు, ‘కింగ్’ అక్కినేని నాగార్జున రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
‘‘భారీ వర్షాలు మరియు వరదలు హైదరాబాద్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయి. నగరం నీటితో నిండిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
తక్షణ ఉపశమనం కోసం రూ.550 కోట్లు విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నాము. తెలంగాణ సిఎం సహాయ నిధికి నా వంతు రూ. 50 లక్షలు ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు నాగార్జున.

తెలంగాణకు రూ.10కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు సీఎంRelated Tags :

Related Posts :