లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

నాగార్జున వచ్చేశాడు.. పుకార్లకు చెక్ పెట్టేశాడు

Published

on

బుల్లితెర బిగ్ రియాలిటీ షో.. బిగ్ బాస్.. సీజ‌న్ 4 మునుపటి సీజన్లతో పోలిస్తే కాస్త హడావుడి తక్కువగానే కనిపిస్తుంది. అప్పట్లో కనిపించిన ఆర్మీలు, నేవీలు హడావుడి అయితే అస్సలు లేదు.. నాగార్జున కూడా డీసెంట్‌గానే షోని హోస్ట్ చేస్తున్నారు. అయితే టీఆర్‌పీలు మాత్రం పెద్దగా రావట్లేదు. అంతకుముందు సీజన్ల కంటే చాలా వీక్‌గా వస్తున్నాయి. నాగార్జున కూడా ఈ షో కోసం మాములు హోస్ట్‌లా కాకుండా చాలా బాగానే కష్టపడుతున్నాడు.అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఎంట్రీ ఇప్పించి సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల అఖిల్, సమంత ఇలా ఎంట్రీ ఇచ్చి ఇరగదీశారు. అయితే లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసిఆర్‌ని క‌లిసి సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి చర్చించగా.. ఆ మీటింగ్‌లో చిరంజీవికి కరోనా వచ్చినట్లు ప్రకటించడంతో పలు రూమర్లు షికారు చేశాయి. నాగార్జున కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారని, ఈ వీక్‌ని నాగ చైతన్య భుజాలపై మోయబోతున్నట్లుగా వార్తలు వచ్చేశాయి.అయితే సీఎంని క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత చిరు త‌నకు క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించి మళ్లీ పరీక్షల్లో నెగెటివ్ అని ప్రకటించగా.. నాగార్జున కూడా ఈ వీక్ తానే హోస్ట్ చెయ్యబోతున్నాను అన్నట్లుగా షూటింగ్ పిక్ ఒకటి పెట్టేసి క్లారిటీ ఇచ్చేశాడు. చిరంజీవితో నాగార్జున స‌న్నిహితంగా మెలిగాడ‌ని, ఈ కార‌ణంతో వెంట‌నే ఆయ‌న ఐసోలేష‌న్‌లోకి ఉన్నాడని వచ్చిన పుకార్లకు చెక్ పెట్టాడు. దీపావళి విషెస్ ట్విట్టర్ ద్వారా చెప్పి, తానే హోస్ట్ చెయ్యబోతున్నట్లు చెప్పకనే చెప్పేశాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *