Akkineni Nagarjuna‘s niece Supriya Yarlagadda Turns Villain for Naga Chaitanya

చైతుకి విలన్‌గా సుప్రియ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇప్పుడు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న’వెంకీమామ’ మూవీలో సుప్రియ నెగెటివ్ రోల్ చెయ్యబోతుందని తెలుస్తుంది..

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ, వెంకీమామలో విలన్‌గా నటించబోతుందా? ఈవార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతుంది. 1996లో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీతోనే సుప్రియ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. తర్వాత హయ్యర్ స్టడీస్, పెళ్ళి, విడాకుల వంటి కారణాలు.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వ్యవహారాలతో ఫుల్ బిజీ అయిపోయింది. చాలా గ్యాప్ తర్వాత అడవి శేష్ ‘గుఢాచారి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ‘వెంకీమామ’ మూవీలో సుప్రియ నెగెటివ్ రోల్ చెయ్యబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు చిత్రబృందం సుప్రియని కలిసి కథ చెప్పినట్టు సమాచారం. బాబీ దర్శకత్వంలో, డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

Related Posts