థియేటర్స్‌లో ‘లక్ష్మీ బాంబ్’.. కానీ మనం చూడలేం!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Akshay Kumar Laxmmi Bomb Releasing on Diwali: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’.. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకను రూపొందించిన రాఘవ లారెన్స్ ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు.


కరోనా కారణంగా ‘లక్ష్మీ బాంబ్’ మూవీని ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాను థియేటర్లలోనే చూసేందుకు అక్షయ్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూశారు కానీ కుదర్లేదు.

అయితే ఈ సినిమా భారత్‌లోని థియేటర్లలో విడుదల కాకపోయినా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాలలో నవంబరు 9న వెండితెరపై విడుదల కానుంది. దీపావళి కానుకగా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో ‘లక్ష్మీ బాంబ్‌’ స్ట్రీమింగ్ కానుంది. అక్షయ్ సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటించింది.. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు.


Related Posts