Akshaya Truthiya Special story

అక్షయ తృతీయ : ఏం దానం చేస్తే.. ఏం లాభం వస్తుంది!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అక్షయ తృతీయ వచ్చింది. ఈ పర్వదినాలు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది మాత్రం బంగారం కొనటం. వాస్తవంగా అక్షయ తృతీయకి సంబంధించిన శాస్త్రాల్లో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
వైశాఖ శుద్ధ తదియ నాడు వచ్చేది అక్షయ తృతీయ. అక్షయం అంటే తరగనిది. తృతీయ అంటే 3 రోజులు. అందుకే హిందువులకు పవిత్రమైనది. హిందూ శాస్త్రం ప్రకారం ఈ మూడు రోజులు తిథి సంపూర్ణంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం నాడు వస్తుంది. నవన్న పర్వం అని కూడా పిలుస్తారు. ఈ తిథి ఇంటికి శుభాలు, విజయాలను తీసుకొస్తుందని భక్తుల విశ్వాసం.
అక్షయ తృతీయ రోజుల్లో ఎవరికైనా దానం చేస్తే, భగవంతుడు వరాలిస్తాడు పురాణాలు చెబుతున్నాయి. ఏ శుభ కార్యమైనా, వ్యాపారం అయినా ప్రారంభించటానికి అక్షయ తృతీయకు మించిన మంచి ముహూర్తం లేదంటున్నారు పండితులు. ఆ రోజు ప్రారంభించే పని.. అంతకంతకూ వృద్ధి చెందుతుందని విశ్వాసం. ఆ రోజు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని బియ్యపు గింజలతో పూజించాలి. దానాలు చేసినా ఎంతో పుణ్యం.

అక్షయ తృతీయకి చేయాల్సిన దానాలు :
అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి.. తలంటి స్నానం చేయాలి. గోమాతను పూజించాలి. గోపులకు గోధుమ, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని పెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే ప్రతీతి. అదే విధంగా వేద పండితులకు బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరలు, చింతపండు, పండ్లు, బట్టలు ఏది దానం చేసినా మంచిదే.
పసుపు, కుంకుమలు : పసుపు, కుంకుమ దానం చేస్తే  మహిళలు సౌభాగ్యవతిగా ఉంటారు.
అన్నదానం : సాక్షాత్తు  దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుంది. 
పండ్లు : పండ్లు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. చెప్పులు, విసనకర్ర, గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది. 
వస్త్ర దానం : రాజయోగం లభిస్తుంది. ఆరోగ్యం చేకూరుతుంది.
మజ్జిగ లేదా నీరు : మంచి విద్య లభిస్తుంది. పెరుగుదానం చేస్తే పాపల నుంచి విముక్తి లభిస్తుంది. ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాల మరణాలు నుంచి బయటపడతాం. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది. ఇలా అక్షయ తృతీయ రోజు ఏది దానం చేసినా ఆ పుణ్యం ఊరికే పోదనే ప్రతీతి ఉంది.

Related Posts