లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సంక్రాంతికి తమిళ, హిందీల్లో అలవైకుంఠపురం రీమేక్

Published

on

అల వైకుంఠపురం.. అల్లు అర్జున్ కెరీర్ కి అదిరిపోయే హిట్. 200కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసి బంపర్ హిట్ అయిన ఈ సినిమా .. ఇప్పుడు అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లో మరో లాంగ్వేజ్ లో కూడా రీమేక్ అవుతోంది. రీమేక్ చేస్తున్న హీరోలిద్దరూ కార్తీక్ లే అవ్వడం మరో ఇంట్రస్టింగ్ న్యూస్.

అల్లు అర్జున్ కెరీర్ లో అదిరిపోయే హిట్ ఇచ్చిన సినిమా అలవైకుంఠపురంలో. బన్నీ కెరీర్ లోనే 200 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసి హయ్యస్ట్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో , పూజాహెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ..స్టోరీతోనే కాకుండా సాంగ్స్ తో కూడా హిస్టరీ క్రియేట్ చేసింది.

టాలీవుడ్ లో ఇంత పెద్ద సూపర్ హిట్ అయిన అలవైకుంఠపురంలో బాలీవుడ్ జనానికి కూడా నచ్చేసింది. బాలీవుడ్ కి అంతగా నచ్చడానికి మరో రీజన్.. బన్నీ. బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలు రికార్డ్ వ్యూస్ తో హిట్ అయ్యాయి. ఇప్పుడుకూడా అలవైకుంఠపురం సినిమా తెగ నచ్చడంతో రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఏక్తాకపూర్ అలవైకుంఠపురం రీమేక్ రైట్స్ ని భారీ రేట్ కి దక్కించుకున్నారు.

సో..హిందీలో ఏక్తా తో పాటు , అల్లు అరవింద్ కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ లాంటి పేర్లు వినపడినా..ఫైనల్లీ కార్తీక్ ఆర్యన్ దగ్గర ఆగింది. ఈ హీరోతో త్వరలోనే సినిమా రీమేక్ ను రెడీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు.

హిందీలో అలవైకుంఠపురం రీమేక్ కి రెడీ అవుతుంటే మరో వైపు సౌత్ లోనే తమిళ్ లో కూడా రీమేక్ చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. శివ కార్తికేయన్ హీరోగా ఈ సినిమాని రీమేడ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజా..తమిళ్ వర్‌షన్ కి మ్యూజిక్ అందించబోతున్నారు. ఇలా హిందీలో కార్తీక్ ఆర్యన్, తమిళ్ లో శివకార్తికేయన్ కలిసి .. సంక్రాంతి విన్నర్ అయిన అలవైకుంఠపురం సినిమాని రీమేక్ చెయ్యబోతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *