అప్పటికే మద్యంమత్తులో ఉంది… గొడవలో మొగుడు జుట్టుపట్టి లాగాడని పెళ్లం ఈడ్చిపెట్టికొట్టింది.. చంపేసింది…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తన జుట్టు పట్టుకుని లాగాడని తాగిన మత్తులో భర్తను ఈడ్చి తన్నిందో భార్య.. ఆ దెబ్బకు భర్త విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది. మద్యానికి బానిసైన భార్యకు ఆమె భర్తకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఒక రోజు భార్యభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో తన భర్త ఆమె జుట్టు పట్టుకుని లాగాడు..ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. వెంటనే తన కాలితో అతడి ఛాతిపై గట్టిగా తన్నింది. అంతే.. ఆ దెబ్బకు 52ఏళ్ల భర్త కుప్పకూలిపోయాడు.. కానీ, తన భర్త తాగిన మత్తులో కిందపడి మృతిచెందడాని పోలీసులకు చెప్పింది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.. మృతుడికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.. పోస్టుమార్ట రిపోర్టులో.. మృతుడు రాజేష్ పక్కటెముక విరిగిపోయిందని, ఊపిరితిత్తులు కూడా బాగా దెబ్బతిన్నాయని నివేదిక వెల్లడించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేష్ తల్లి తన కోడలిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు పునిమాలి (35)ను స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారించారు.. తానే భర్తను చంపినట్టు అంగీకరించింది. పోలీసుల కథనం ప్రకారం.. తన భర్త రాజేష్‌తో గొడవ పడ్డాక పుణి తన తల్లిదండ్రులతో కలిసి పాద్రా గ్రామంలోని వారి ఇంట్లో ఉంటుంది.

ఆగస్టు 3న రాజేష్ ఆమెను కలవడానికి అక్కడికి వెళ్ళాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో, పుని రాజేష్ ఛాతిపై బలంగా తన్నింది.. దాంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. రక్షా బంధన్‌ కోసం ఇంటికి వచ్చిన రాజేష్ సోదరి పునిని అడిగింది.. అతిగా తాగడం వల్ల జరిగిన ప్రమాదంలో రాజేష్ మరణించాడని చెప్పింది.ఆమె చెప్పిన మాటలు రాజేష్ తల్లి నర్మదా నమ్మలేదు.. ఇంటికి వచ్చి రాజేష్ మృతదేహాన్ని చూశాక ఆమె అనుమానం మరింత బలపడింది.. రాజేష్ అప్పుడప్పుడు మద్యం సేవించే మాట నిజమేనని ఆయన అనుమానంతో పోస్టుమార్టం చేయాలని కోరింది.. పోస్టుమార్టం నివేదికలో రాజేష్ హత్యకు గురైనట్లు తెలిసింది. నర్మదా అనుమానం ఆధారంగా పోలీసులు పునిని విచారించారు.

విచారణ సమయంలో నిందితురాలు ఆగ్రహంతో ఊగిపోయింది. తల్లిదండ్రుల ఇంట్లో గొడవ తర్వాత రాజేష్‌ను చంపినట్లు ఆమె అంగీకరించింది. మృతుడు తన భార్యను తనతో కూర్చోమని కోరాడు. ఇంట్లో పని ఉందని చెప్పింది. తనకు సమయం లేదని చెప్పింది. రాజేష్ భార్య జుట్టును లాగాడు. తనను తాను విడిపించుకునే క్రమంలో అతని ఛాతీపై గట్టిగా కొట్టింది. అతను కింద పడి మృతిచెందాడని పోలీసుల విచారణలో అంగీకరించింది.

READ  అనంతలో తీవ్ర విషాదం, కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య, అనాథగా 12ఏళ్ల బాలుడు

Related Posts