లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ఒడిశాలో దారుణం : మందుతాగి గోల చేస్తున్నాడని తగులబెట్టారు

Published

on

Alcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  Angul జిల్లాలోని కడలిముండ గ్రామంలో..25 సంవత్సరాలున్న యువకుడు..మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో హల్ చల్ చేసేవాడు. బంధువులు, ఇరుగుపొరుగువారు, ఇతరులతో అసభ్యకరంగా ప్రవరిస్తుండడంతో వారంతా విసిగిపోయారు.

ప్రతి రోజు ఇంటి మీదకు గొడవలు తెస్తుండడంతో కుటుంబసభ్యులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మద్యం మానేయాలని బంధువులు సూచించారు. కానీ..పరిస్థితిలో మార్పు రాలేదు. అతడి వైఖరి శృతిమించడం, ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో..2021, జనవరి 12వ తేదీ సాయంత్రం యువకుడు మద్యం తాగి వచ్చి గొడవ చేయడం ప్రారంభించాడు. కొంతమంది అతడిని చెట్టుకు కట్టేశారు. దారుణంగా కొట్టారు. తీవ్ర ఆగ్రహంగా ఉన్న వారు..ఏకంగా పెట్రోల్ పోసి..నిప్పంటించారు. మంటలకు తాళలేక కేకలు వేశారు. వాళ్లు ఏ మాత్రం కనికరించలేదు. దీంతో మంటల్లో సజీవదహనమయ్యాడు. వెంటనే కొంతమంది అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి రాజ్ కిషోర్ గా గుర్తించారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *