లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన బ్రిటీష్ పీఎం బోరిస్ జాన్సన్

Updated On - 10:21 am, Tue, 5 January 21

Nationalwide Lockdown: బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘మున్ముందు కొన్ని వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. మనం చివరి దశలో ఉన్నట్లు నమ్ముతున్నా’ అని జాన్సన్ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు.

వైరస్‌పై మనకు అర్థమయ్యే పరిస్థితి మారడం లేదు. చనిపోయే రేటు తగ్గితే.. వ్యాక్సిన్ ప్రభావం చూపిస్తే స్కూల్స్ అన్నింటినీ ఫిబ్రవరి 2021నాటికి రీ ఓపెన్ చేస్తారు. ‘చరిత్రలోనే పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. యూరప్‌ మొత్తంలో యూకేలోనే ఎక్కువమందికి వ్యాక్సిన్ అందుతుంది’ అని జాన్సన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

‘యూకే చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ సలహామేరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే చాలా ప్రమాదకరంగా మారుతుంది. దేశమంతా అలర్ట్ లెవల్ 5కు చేరుకుంటుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ 21రోజుల్లో కెపాసిటీని దాటిపోతుంది’ అని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

ఫిబ్రవరి నెల మధ్య వరకూ నేషన్‌వైడ్ లాక్‍‌డౌన్ అనేది కొనసాగుతుంది. యూకే గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం.. అత్యవసరం లేని షాపులు, పర్సనల్ కేర్ సర్వీసులు మూసే ఉంచుతారు. రెస్టారెంట్లు కేవలం పార్శిల్ సర్వీసులకుమాత్రమే అనుమతిస్తున్నారు. ఫిజికల్ స్కూల్స్ కూడా క్లోజ్ అయ్యే ఉంటాయి.

యూనివర్సిటీలన్నీ తమ స్టూడెంట్లకు ఫిబ్రవరి వరకూ రావొద్దని సూచనలు ఇచ్చేశాయి. బ్రిటన్ లోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. హాస్పిటల్స్ లో పేషెంట్ల సంఖ్య 30శాతం వరకూ పెరిగిపోయింది. ఇది చాలాదన్నట్లు కొత్త కరోనా స్ట్రెయిన్ కూడా సమస్యగా మారింది.