Alia Bhatt becomes most unfollowed star, Kangana Ranaut gains the max as fans express anger

సుశాంత్ సూసైడ్.. అలియాకు ఎదురుదెబ్బ, కంగనా కలిసొచ్చింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సూశాంత్ సూసైడ్ రెండ్రోజుల్లో సోషల్ మీడియాలో రివల్యూషన్ తీసుకొచ్చింది. నెటిజన్ల టార్గెట్ మొత్తం అలియా భట్ గా కనిపిస్తుంది. ఎంఎస్ ధోనీ ద అన్‌టోల్డ్ స్టోరీ, కేదర్‌నాథ్ లాంటి హిట్ మూవీలు చేసిన సుశాంత్.. 2020 జూన్ 14న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. యాక్టర్ కెరీర్ మీద ప్రభావం చూపించిన బాలీవుడ్ సినీ కల్చర్‌ను ఏకి పారేస్తున్నారు. 

మృతి అనంతరం అలియా భట్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్, కరణ్ జొహర్ లు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేయడంతో రచ్చ మొదలైంది. కంగనా రనౌట్ సోషల్ మీడియాలో సుశాంత్ మృతిపై బాలీవుడ్ చూపిస్తున్న సానుభూతిని తిట్టిపోసింది. ఈ కామెంట్లకు సీన్ రివర్స్ అయింది. 

సంతాపం తెలియజేసిన అలియాను సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోయడంతో పాటు అన్ ఫాలో చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో 4లక్షల 44వేల ఫాలోవర్లు వదిలిపెట్టేశారు. కరణ్ జొహర్ లక్షా 88వేల మంది అభిమానులు వదిలేశారు. అలియా భట్, కరణ్ జొహర్ ల తర్వాత సోనమ్ కపూర్ ను 88వేల ఫాలోవర్లు వదిలి పెట్టిపోయారు. ఇక సల్మాన్ ఖాన్ ఫాలోవర్లలో కొంచెం తేడా మాత్రమే కనిపించింది. 50వేలు మాత్రం అన్ ఫాలో చేసి వదిలిపెట్టేశారు. 

ఇదిలా ఉంటే.. మణికర్ణిక స్టార్ కంగనా రనౌట్ కు ఫాలోయింగ్ పెరిగిపోతుంది. రెండ్రోజుల్లో ఒక్కసారిగా 1.47 మిలియన్ ఫాలోవర్లు పెరిగిపోయారు. సుశాంత్ క్లోజ్ ఫ్రెండ్  కృతిసనన్, శ్రద్ధా కపూర్, సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ లకు అభిమానులు పెరిగిపోయారు. వరుసగా 2లక్షల 91వేలు, 2 లక్షల 70వేలు, 2లక్షల 12వేల ఫాలోవర్లు పెరిగారు. ఇవి చాలదన్నట్లు Justice For Sushant Singh Rajput ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. ఇక తర్వాత రిలీజ్ కాబోయే దిల్ బేచారా సినిమా ఏ పాటి హిట్ సాధిస్తుందో చూడాలి. 

Related Posts