ఇంటర్ విద్యార్ధులకు శుభవార్త…ఫీజు కట్టినోళ్ళంతా పాస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన పంపించారు.ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగానే అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. ఈ మేరకు త్వరలో అధికారికి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెండో సంవత్సరానికి చెందిన సుమారు 27 వేల మంది విద్యార్దులకు ప్రయోజనం చేకూరుతుంది.

అన్ లాక్ – 4 ఏపీ మార్గదర్శకాలు : 21 నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి


మార్చిలో పరీక్షలు రాసేందుకు రెండో సంవత్సరం విద్యార్దులు 4.30 లక్షల మంది హాజరుకాగా వారిలో 2,83,463 మంది ఉత్తీర్ణులయ్యారు. కరోనా వైరస్ నేపధ్యంలో పరీక్ష తప్పిన విద్యార్ధులకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిపే అవకాశం లేనందున వాటిని రద్దు చేశారు. పరీక్షలు రాసి తప్పిన ద్వితీయ సంవత్సరం విద్యార్దులను పాస్ చేస్తునట్లు ప్రభుత్వం జూలై 19న ప్రకటించింది. దానివల్ల 1.47 లక్షల మందికి తప్పిన సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కు ఇచ్చి ఉత్తీర్ణులను చేశారు.పరీక్ష ఫీజు చెల్లించి వివిధ కారణాలతో హాజరు కాలేకపోయిన వారు మరో 27 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. దీంట్లో ప్రమాదాలు, జ్వరంతో పాటు వివిధ కారణాలతో ఒకటి, రెండు పరీక్షలు రాయని వారే ఎక్కువమంది ఉన్నారు. వీరిలో ఫీజు కట్టినా ఏ పరీక్షా రాయని వారూ సుమారు తొమ్మిది వందల మంది వరకూ ఉన్నారు. వారందరూ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలన్నా  ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు.

ఈ క్రమంలో తమకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని లేదంటే, పాస్ చేయాలని విద్యార్థులు ఇంటర్ బోర్డు, సర్కార్‌‌ను కోరారు. అయితే దీనిపై న్యాయ నిపుణులతోనూ, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ ఇంటర్ బోర్డు చర్చించింది. అందుకని వారికి కూడా కనీస మార్కులు ఇచ్చి పాస్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.అందరికీ 35 శాతం మినిమమ్ మార్కులు వేసి పాస్ చేయాలనే ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు.. సర్కార్‌‌కు పంపించింది.  దీనికి ప్రభుత్వం ఓకే చెప్తుందని బోర్డు ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే సెకండియర్ ​స్టూడెంట్స్ అయినా, ఫస్టియర్ ​బ్యాక్ లాగ్ సబ్జెక్టులున్నా.. వారిని కూడా పాస్​ చేయనున్నారు.Related Tags :

Related Posts :