లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బంగారు బుల్లోడు సినిమాను అడ్డుకుంటాం.. స్వర్ణ కార సంఘాలు..

Published

on

Bangaru Bullodu: అల్లరి నరేష్, పూజా ఝవేరి జంటగా.. పి వి గిరి దర్శకత్వంలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’.. సినిమా జనవరి 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్వర్ణ కార సంఘాలు తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Bangaru Bullodu

Bangaru Bullodu

ఈ మేరకు సినిమాలోని అభ్యంతర కర సన్నివేశాలను తొలగించాలంటూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో వారు ఫిర్యాదు చేశారు. కర్రీ వేణు మాధవ్ (అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణ కార సంఘం).. మాట్లాడుతూ: ‘‘సినిమాలో వున్న అభ్యంతరకర సన్నివేశాలు వెంటనే తొలగించాలి.. ఒకరి బంగారపు వస్తువులను మరొకరి ఫంక్షన్‌కి స్వర్ణకారులు ఇవ్వరు.. అలా ఇస్తున్నట్టు స్వర్ణ కారులను కించపరుస్తూ ట్రైలర్‌లో చూపించారు.. అసలు అలాంటివి జరుగవు.. అలాగే ఇంకా సినిమాలో స్వర్ణ కారులపై ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలున్నా వాటిని తొలగించాలి..’’ అన్నారు.

కందుకూరి పూర్ణా చారి..(తెలంగాణా స్వర్ణకార సంఘంప్రధాన కార్యదర్శి) మాట్లాడుతూ: ‘‘మా వృత్తి పై నిందలు మోపేలాఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలి.. నిర్మాత మాకు రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వెయ్యాలి.. లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆడకుండా అడ్డుకుంటాం..’’ అన్నారు.

Bangaru Bullodu

Bangaru Bullodu