లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ఫాదర్ ఆఫ్ తెలుగు OTT’

Published

on

తెలుగు ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇమేజ్.. స్పెషాలిటీనే సపరేట్. ప్లానింగ్ అలానే ఉంటుంది మరి. ఇప్పటి వరకు ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు దాదాపు 90 శాతం విజయాలున్నాయంటే ఆయన జడ్జిమెంట్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఆయన నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీలో వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి.

లాక్‌డౌన్ సమయంలో ఇండస్ట్రీ అంతా స్తంభించిపోతే అల్లు అరవింద్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఎంతోమంది సినీ కార్మికులకు లాభం చేకూర్చారు. ఆహా ఓటిటి సంస్థను స్థాపించి అందులో తెలుగు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆహాను 100 పర్సెంట్ తెలుగు కంటెంట్ అంటే కొంతమంది నవ్వుకున్నారు. కానీ నవ్విన వాళ్లతోనే ఆహా అనిపిస్తున్నారు అల్లు అరవింద్.



లాక్‌డౌన్ సమయంలో ఆహా తీసుకున్నన్ని కొత్త సినిమాలు.. కంటెంట్ మరే ఓటీటి ప్లాట్ ఫామ్ కూడా తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలోనే ఒరేయ్ బుజ్జిగా, క‌ల‌ర్‌ ఫోటో, భానుమ‌తి రామ‌కృష్ణ‌, జోహార్ లాంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు అల్లు అరవింద్.

మరోవైపు ఆహా కంటెంట్‌తో పాటు లాక్‌డౌన్ సమయంలోనే హీరోల డేట్స్ తీసుకుని ఆరు సినిమాలకు శ్రీకారం చుట్టారు. అందులో కార్తికేయ చావు కబురు చల్లగా.. నిఖిల్ 18 పేజెస్.. అల్లు శిరీష్ సినిమా.. వరుణ్ తేజ్ సినిమా.. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి సినిమాలను నిర్మిస్తున్నారు.

ఓ వైపు క్రేజీ సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూనే ఆహా కంటెంట్ కూడా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 180 మంది పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళంతా లాక్ డౌన్ సమయంలో పని లేకుండా ఉండిపోయారు. మరో వైపు థియేటర్స్ మూత పడి ఉండటంతో వాళ్లు తెరకెక్కించిన సినిమాలను కూడా ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో తెలియక ఉండిపోయిన చాలా సినిమాలను ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా విడుదల చేశారు అల్లు అరవింద్.

ఇదంతా ఎందుకు చేశారనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే.. ఎంతోమంది ఎన్నో కోట్ల ఆశలతో మంచి సినిమాలు చేసి.. చేతిలోనే ఉంచుకుని విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు సాయం చేయడానికే అల్లు అరవింద్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేసిన ఆయన ప్రయత్నం వంద కాదు 200 శాతం సక్సెస్ అయింది.

అల్లు అరవింద్ టాలీవుడ్‌లో ఫాదర్ ఆఫ్ తెలుగు ఓటిటిగా మారిపోయారు. ఒకప్పుడు ఏం ఓటీటి అన్నవాళ్లే ఇప్పుడు ఆహా ఓటీటి అంటున్నారు. ఇదంతా చూస్తుంటే అనుభవం అనేది ఓ నిర్మాతకు ఎంత అవసరమో అర్థమవుతుంది. ఈ తరం నిర్మాతలకే కాదు ఎంతోమందికి తన నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే చేయలేని పనిని ఈయన సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *