అల్లు అర్హ ‘అంజలి అంజలి’ సాంగ్ చూశారా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Happy BirthDay Allu Arha: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు నేడు (నవంబర్ 21). ఈ సందర్భంగా క్లాసిక్‌ మూవీ ‘అంజలి’ సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాటను రీ క్రియేట్ చేసి.. వీడియో సాంగ్ అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు.Allu Arjunక్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘అంజలి’ సినిమాలోని ఈ పాటలో అల్లు అర్హ క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో, ముద్దుముద్దులొలికే చిరునవ్వుతో ఆకట్టుకుంది. అర్హతో పాటు అల్లు అయాన్‌, తాతయ్యలు అల్లు అరవింద్‌, కేసీ శేఖర్‌ రెడ్డి, డా.వెంకటేశ్వరరావులతో పాటు అల్లు అర్జున్‌ కూడా నటించడం విశేషం.


నాటి క్లాసిక్‌ సాంగ్‌కు ధీటుగా ఈ పాటను కలర్‌ఫుల్‌గా రీ క్రియేట్‌ చేశారు. గణేశ్‌ స్వామి కొరియోగ్రఫీ చేసిన అంజలి వీడియో సాంగ్‌కు సూర్య సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ఇప్పుడు అల్లు అర్హ అంజలి సాంగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related Tags :

Related Posts :