Allu Arjun Condolences to Legendary Choreographer Saroj Khan

ఆమె నా తొలి కొరియోగ్రాఫర్.. సరోజ్ ఖాన్ మృతి పట్ల సంతాపం తెలిపిన బన్నీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో యావత్‌ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేలకు పైగా సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. తెలుగులోనూ పలు సినిమాల్లో సూపర్ హిట్ పాటలకు ఆమె అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారు.

Allu Arjun

సరోజ్ ఖాన్ మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సరోజ్ ఖాన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు. ‘డాడీ’ సినిమా కోసం ఆమెతో కలిసి పనిచేశానని, సరోజ్ ఖాన్ తన తొలి కొరియోగ్రాఫర్ అని, ఆమె మరణం తీరని లోటు.. ఆమె ఆత్మకు శాంతి, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు కలగాలని కోరుకుంటున్నట్లు బన్నీ ట్వీట్ చేశారు.

Allu Arjun Tweet

Read:సరోజ్ ఖాన్ కన్నుమూత..

Related Posts