మోసగాళ్లకు స్టైలిష్ స్టార్ సాయం.. నాగశౌర్య నయా లుక్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Allu Arjun – Naga Shaurya: మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో సినిమా రూపొందుతోంది. జెఫ్రీ గీ చిన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విష్ణు సోదరి పాత్రలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండటం విశేషం.


ఇప్పుడీ సినిమాకు స్టైలిష్‌‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సాయమందిస్తున్నారు. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అసలు ఆ ఐటీ స్కామ్‌ ఎంత పెద్ద మొత్తంలో జరిగిందో తెలియజేసే గ్లింప్స్‌ ప్రోమోను అక్టోబర్‌ 3న అల్లు అర్జున్‌ విడుదల చేయబోతున్నట్లు మంచు విష్ణు తెలిపారు.


ఇటీవల ‘మోసగాళ్లు’ మోషన్‌ పోస్టర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. రుహానీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది.


యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాగశౌర్య రెండు షేడ్స్‌లో కనిపించనున్నాడు. అందుకోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు.


ఇది వరకు 8 ప్యాక్‌ బాడీతో పాటు పోనీ టెయిల్‌‌‌తో ఉన్న శౌర్య లుక్‌ వైరల్ అయింది. తాజాగా ఆ లుక్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దీంతో శౌర్య కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ట్రిమ్‌ చేసిన గడ్డంతో నాగశౌర్య కొత్త లుక్‌ ఆకట్టుకుంటుంది.


Related Posts