Allu Arjun Family Summer Vacation Pics Goes Viral

స్టైలిష్ స్టార్ సమ్మర్ వెకేషన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుతం షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న బన్నీ, ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌కి విదేశాలకు వెళ్ళాడు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. వాళ్ళకి ఏమాత్రం వీలు దొరికినా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. మహేష్ ఏడాదికి కనీసం రెండు సార్లయినా ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వేస్తాడు. బన్నీ వీలయినంత ఎక్కువ సమయం పిల్లలు అయాన్, అర్హలతో గడుపుతుంటాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందబోయే #AA19 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న బన్నీ, ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌కి విదేశాలకు వెళ్ళాడు. స్విట్జర్లాండ్‌లోని అందమైన లొకేషన్స్‌లో భార్య, పిల్లలతో కలిసి సరదాగా గడుపుతూ, ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు.

పాపని స్నేహా, బాబుని బన్నీ ఎత్తుకుని ఉన్న పిక్‌కి.. ‘లైఫ్ ఎలా ఉంది’? అని ప్రశ్నిస్తూ, ‘అండ్ దే సెడ్’.. ‘హ్యాపీగా’ అంటూ పోస్ట్ చేసాడు. అయాన్‌ని స్ట్రోలర్‌లో అక్కడి వీధుల్లో తిప్పుతూ, ఆ పిక్‌కి ‘డాడీ కూల్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు బన్నీ బాబు. ఈ ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పిక్స్‌‌ని తెగ షేర్ చేసేస్తున్నారు. త్వరలో తిరిగి త్రివిక్రమ్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు అల్లు అర్జున్. దీంతో పాటు సుకుమార్, వేణు శ్రీరామ్‌లతోనూ సినిమాలు చెయ్యనున్నాడు. 

Related Posts