లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Allu Arjun Met His Fan: నాగేశ్వరరావు కల నెరవేర్చిన బన్నీ..

Published

on

Allu Arjun met his avid fan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కోరిక నెరవేర్చారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కంభంపాడుకి చెందిన నాగేశ్వరరావు అల్లు అర్జున్‌ వీరాభిమాని.. ఎలాగైనా అల్లు అర్జున్‌ని కలవాలని సెప్టెంబర్‌17వ తేదీన ఆయన మాచర్ల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.


‘గంగోత్రి’ సినిమా నుంచి ఆయనకు వీరాభిమానిని అయిన నాగేశ్వరరావు.. ఇప్పటికే నాలుగైదు సార్లు బన్నీని కలిసేందుకు ప్రయత్నించాడట. ఈసారి మాత్రం బన్నీని కలవకుండా మాచర్ల తిరిగివెళ్లే ప్రసక్తే లేదని పట్టుదలతో ఉన్నాడు. బన్నీని కలిసి ఒక ఫొటో దిగి, రెండు నిమిషాలు మాట్లాడి గానీ మాచర్ల వెళ్లనని ఖరాకండిగా చెప్పేశాడు.


కట్ చేస్తే.. ఇప్పుడు అతని కల నెరవేరింది.. అభిమానుల ద్వారా నాగేశ్వరరావు విషయం తెలుసుకున్న బన్నీ.. శనివారం తనను ఆఫీసుకి పిలిపించారు. నాగేశ్వరరావును ఆప్యాయంగా పలకరించి, అతని వివరాలడిగి.. కలిసి ఫోటోలు దిగారు.. తన జీవితకాలపు కల నెరవేరడంతో నాగేశ్వరరావు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Allu Arjun

కరోనా టైమ్‌లో కూడా తమ అభిమాన హీరోను కలవడానికి ఇంతటి సాహసం చేసిన నాగేశ్వరరావు కోరిక తీరాలని, అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యే వరకు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తాం అంటూ బన్నీ ఫ్యాన్స్ అందరూ నాగేశ్వరరావు వీడియోను వైరల్ చేసి, సాటి అభిమానులుగా అతనికి తమవంతు సాయం చేశారు బన్నీ అభిమానులు..


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *