లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

‘స్టన్నింగ్ అన్నో’.. ‘రౌడీ’ డ్రెస్‌లో అల్లు అర్జున్‌ అదిరిపోయాడుగా!

Published

on

Allu Arjun – Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ స్టార్, యూత్‌లో రౌడీ హీరోగా పాపులర్ అయిన గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో ఓ దుస్తుల బ్రాండ్‌ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ‘రౌడీ’ బ్రాండ్‌కు విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయ్యాడు. దీంతో బన్నీకి విజయ్ గతంలో ‘రౌడీ’ బ్రాండ్ దుస్తులను పంపించాడు.



ఇప్పుడు మరోసారి బన్నీ కోసం విజయ్ ప్రత్యేకంగా డ్రెస్ డిజైన్ చేసి పంపించాడు. విజయ్ పంపిన డ్రెస్ బాగా నచ్చింది అంటూ ట్విట్టర్ ద్వారా విజయ్‌కు థ్యాంక్స్ తెలియజేశాడు అల్లు అర్జున్.


‘ఇలాంటి కంఫర్టబుల్, బ్యూటిఫుల్ డ్రెస్ పంపించినందుకు నా బ్రదర్ విజయ్ దేవరకొండకు, రౌడీ క్లబ్ సభ్యులకు థ్యాంక్స్. నాపై నువ్వు చూపిన ప్రేమకు థ్యాంక్స్ బ్రదర్. నువ్వు మరింతగా ఎదగాలి’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ.. ‘స్టన్నింగ్ అన్నో’.. అంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు.

 

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *