దడ పుట్టించే వీడియో, పెళ్లికి రెడీ అవుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు, పరుగులు తీసిన జనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడులో 135 మంది చనిపోయారు. 5వేలకు మందికిపైగా గాయపడ్డారు. బీరుట్ లోని ఓ పోర్టులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి పోర్ట్ లోని ఓ గోడౌన్ లో ఆరేళ్లుగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పేలుడు ఎలా జరిగిందన్న దానిపై విచారణ సాగుతోంది. ఘటనలో చాలా భవనాలు ధ్వంసం కాగా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. పేలుడు శబ్దం 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వినిపించిందంటే పేలుడు తీవ్రత ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. భద్రత చర్యలు లేకుండా 2వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదని లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు.

lebanon explosion: లెబనాన్ రాజధానిలో భారీ ...

అదే సమయంలో ఇస్రా సెబ్లానీ అనే మహిళా డాక్టర్ అమెరికా నుంచి బీరుట్ వచ్చింది. త్వరలో ఆమె పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి మూడు వారాల ముందే బీరుట్ వచ్చింది. 29ఏళ్ల ఇస్రా పెళ్లి కూతురు డ్రెస్ లో ఉంది. ఆమె వెడ్డింగ్ వీడియో షూట్ జరుగుతోంది. అదే సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక భయంతో పరుగులు తీశారు. ఈ పేలుడు తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే, ఇస్రా కాళ్ల కింద భూమి కదిలింది. ఈ పేలుడు తీవ్రతకు ఇస్రా బాగా భయపడింది.The Lebanon Explosions in Photos - The New York Times

ఇస్రా అమెరికాలో డాక్టర్ గా పని చేస్తుంది. పెళ్లి కోసం బీరుట్ వచ్చింది. ”అందరి అమ్మాయిల్లా నేనూ చాలా ఆనందంగా ఉన్నా. కొన్ని వారాల్లో పెళ్లి జరగనుంది. పెళ్లి కూతురు డ్రెస్ లో చూసి నా తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడియో షూట్ అవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. నేను షాక్ అయ్యాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను చనిపోతానా? ఎలా చనిపోతాను?” అని ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఇస్రా పంచుకుంది.

ఆ పేలుడుకి చాలా నష్టమే జరిగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. కానీ నేను, నా ఫొటోగ్రాఫర్ ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాం. మమ్మల్ని కాపాడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని ఇస్రా అంది.


Related Posts