లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కవిత రాసిందెవరు.. ఏం చెప్తున్నారు?

Updated On - 11:09 am, Thu, 21 January 21

America President poem: అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అందుకున్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఓ నల్ల జాతీయురాలైన అమాండా గోర్మన్ కవితను చదివి వినిపించారు. తమ పూర్వీకులు ఎవరూ ఎదుర్కోనన్ని ఛాలెంజ్‌లు అమాండా ఎదుర్కొన్నారు. ఇందులో ఆ పరిస్థితులను.. వాస్తవాలను ప్రతిబింబించేలా రాసి అందరి మనసులు గెలుచుకున్నారు. రాజకీయ మార్పులు దేశాన్ని ఎలా తూట్లు పొడిచాయో వివరించారు. జనవరి 6న ట్రంప్ అనుచరులు క్యాపిటల్ లో ఆందోళన చేయడాన్ని కూడా ప్రస్తావించి కవిత ముగించారు.

‘మనం చాలా వారాలుగా చూస్తున్న ఘటనను ధైర్యంగా చెబుతున్నా. ఏళ్లతరబడి అనుభవిస్తునే ఉన్నాం. మనమంతా కలిసి దేశాన్ని బాగు చేసుకోగలం. ఈ పోకడ.. భయంకరమైన నిజాల నుంచి బయటపడాలంటే దేశం చాలా శ్రమించాల్సి ఉంది’ అని న్యూయార్క్ టైమ్స్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్న 22ఏళ్ల గోర్మన్ అమెరికా చరిత్రలో నిలిచిన పిన్న వయస్సు కవయిత్రి. జిల్ బైడెన్ అటెన్షన్‌తో ఆరంభోత్సవ కమిటీ దృష్టి మొత్తం ఆమె వైపు తిప్పుకున్నారు. సభ మొత్తం వినిపించేలా.. ప్రపంచం మొత్తం గుండెకు చేరేలా పదాలు అల్లుకున్నాయి.

ఓ బహిరంగ సభలో ఆమె చదివిన కవిత.. మండుటెండలో ‘కొండ ఎక్కితుంటే అనే కవితను చదువుతూ ఆమె కళ్లు చెమర్చారు. గోర్మన్ ఆమె గురించి చెప్పుకుంటూ నల్లని రంగు చర్మం ఉన్న వ్యక్తిగా.. బానిసలుగా చూస్తున్న సమాజంలో తల్లి ప్రోత్సాహంతో ఎదిగిన వ్యక్తిగా అభివర్ణించుకున్నారు. కొత్త ప్రభుత్వ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. అందరూ ఐక్యంగా ఉండే బాధ్యత మనపై ఉంది’ అని అన్నారు.