Home » అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లు షురూ
Published
1 month agoon
Amarnath Yatra వచ్చే వేసవిలో మొదలయ్యే అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో 2019లో, కరోనా మహమ్మారి ముప్పు నేపథ్యంలో 2020లో అమర్నాథ్ యాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. స్థానికులు నిరసనలు తెలుపుతారన్న ఆందోళనల మధ్య 2019 ఆగస్టు ఐదో తేదీన జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడానికి కొద్ది రోజుల ముందు ఇతర ప్రాంతాల సందర్శకులు తక్షణం కశ్మీర్‌లోయను వీడి వెళ్లాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
రెండేండ్ల బ్రేక్ తర్వాత ఈ వేసవిలో అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరిగే యాత్రలో ఆరు లక్షల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. యాత్ర నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్త్రుత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. యాత్ర మార్గంలో వాకింగ్ ట్రాక్‌లను విస్తరించాలని,బాల్తాల్ నుండి ట్రాక్‌లపై ముందుగా నిర్మించిన సిమెంట్ పలకలను వేయడంపై ప్రత్యేక దృష్టి సారించి నిలబెట్టుకునే గోడలను నిర్మించాలని జమ్మూకశ్మీర్ యంత్రాంగం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) ఉన్నత స్థాయి కమిటీ 10వ సమావేశానికి అధ్యక్షత వహించిన చీఫ్ సెక్రటరీ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఈ ఆదేశాలను ఆమోదించారని అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు.
సాధారణంగా ప్రతి ఏటా అమర్నాథ్ యాత్ర..జూన్-జూలైలో అనంతనాగ్ జిల్లాలోని సాంప్రదాయ 36 కిలోమీటర్ల పొడవైన పహల్గామ్ మార్గంలో మరియు గండెర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవైన బాల్తాల్ మార్గంలో ప్రారంభమవుతుంది. ఆగస్టులో ఈ యాత్ర ముగుస్తుంది.
కాగా, 2011లో అత్యధికంగా 6.35 లక్షల మంది యాత్రికులు అమర్నాధ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉద్భవించే మంచు శివలింగాన్ని భక్తులు దర్శించుకున్నారు. 2012లో 6.22 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారు. భక్తులు, సందర్శకుల సంఖ్య పెరుగడం వల్ల పర్వత శ్రేణుల సహజ పర్యావరణం దెబ్బ తింటుందని పర్యావరణ వేత్తల నుంచి విమర్శలు వచ్చాయి. రోజురోజుకు హింస పెరుగడంతో 2013 నుంచి సందర్శకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2019లో 3.8 లక్షల మంది మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్, మెసేజ్‌లు పంపలేరు, మే 15 నుంచి అమలు
రైతుల రైల్ రోకో, భారీగా పోలీసుల బందోబస్తు
ఎస్ఈసీ కార్యాలయం వద్ద హైసెక్యూరిటీ…నిమ్మగడ్డకు భద్రత పెంపు
ట్రాఫిక్ ఆంక్షలు లేవు..బందోబస్త్ లేదు : ఆకస్మికంగా మోడీ గురుద్వారా సందర్శన
బెంగాల్ బీజేపీ ఇన్ఛార్జికి Z కేటగిరీ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ఫ్రూఫ్ కారు
43యాప్‌లను బ్లాక్ చేసిన గవర్నమెంట్