లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

రాగితో లాభాలెన్నో.. కాంతివంతమైన చర్మంతో పాటు కలిసొచ్చే ఆరోగ్యం కూడా

Published

on

Copper Vessel: రుచికరంగా ఎన్ని తినుబండారాలు తిన్నా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేకపోతే పూట పూర్తి కాదు. దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగడం ఓ వంతైతే.. మంచి నీళ్లు తాగడమే ఆరోగ్యం అని నిపుణులు చెబుతున్నారు. అలా సమయానికి నీళ్లు తాగడం కరెక్ట్ అయితే ఇంకొంత మెరుగైన సలహా ఏంటంటే.. కాపర్ (రాగి) బాటిల్స్ లో నీరు తాగడం.

పాత కాలం నుంచి నీటిని జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవడం కోసం అలా చేసేవారు. యూవీ ఫిల్టర్లు, ఆర్ఓ ప్యూరిఫైయర్లు బాగా పాపులర్ అయిన ఈ రోజుల్లో రాగి బిందెలో నీళ్ళు నింపి ఉంచడం పాత పద్ధతిలా కనిపించినా.. అది చాలా ఆరోగ్యం అని ఆయుర్వేదంతో సైంటిఫిక్ స్టడీస్ నొక్కి చెబుతున్నాయి. ఇక ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం..

కాన్సర్ రిస్క్..
కాన్సర్ కారకాలను రాగిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వాటి ఎఫెక్ట్స్‌ని తగ్గిస్తాయి. ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ల నుంచి కూడా సేఫ్ గా ఉండొచ్చు.

గాయాలు త్వరగా మానేందుకు..
రాగిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన రాగి త్వరగా గాయాలను మానేలా చేస్తుంది. ఇమ్యూనిటీని బలపరుస్తుంది. సీ ఫుడ్, ఆర్గన్ మీట్, హోల్ గ్రెయిన్స్, పప్పులు, నట్స్, సీడ్స్, చాకొలేట్, సిరియల్స్, బంగాళా దుంప, బఠానీ, కొన్ని ఆకు కూరల ద్వారా రాగి శరీరానికి అందుతుంది.

జీర్ణ సమస్యలు దూరం
రాగికి పొట్ట లోపల ఇన్‌ఫ్లమేషన్‍‌ని తగ్గించి హానికారక బ్యాక్టీరియాని నశింపచేసే గుణాలు ఉంటాయి. ఫలితంగా అల్సర్స్, ఇన్‌డైజెషన్, ఇన్‌ఫెక్షన్స్ వంటి వాటికి మంచి రెమెడీలా పని చేస్తుంది. పొట్టని క్లీన్ చేసి డిటాక్స్ చేయడంలో లివర్, కిడ్నీ ఫంక్షనింగ్‌ని రెగ్యూలేట్ చేయడంలో ఫుడ్ నుండి న్యూట్రియంట్స్‌ని శోషించుకోవడంలో వేస్ట్ ని బయటకి పంపడంలో రాగి సహకరిస్తుంది.

బరువు దూరం
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే బరువు త్వరగా తగ్గుతారు. రాగి కొవ్వుని కరిగించి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అనవసరమైన కొవ్వుని శరీరంలో ఉండనీయదు. రాగి బిందెలో నీరు శరీరానికి హాని చేసే మైక్రో ఆర్గానిజమ్స్, మోల్డ్స్, ఫంగై, ఆల్గే, బ్యాక్టీరియా వంటివి అన్ని నశించిపోయి నీరు తాగడానికి సురక్షితంగా తయారౌతుంది. రాగి పాత్రలో రాత్రంతా కనీసం నాలుగు గంటల పాటూ ఉంచితే కొన్ని గుణాలు అబ్బుతాయి.

గుండె ఆరోగ్యం..
రాగి గుండె జబ్బుల రిస్క్ ని తగ్గిస్తుంది. అంతే కాక, బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేసి, చెడు కొలెస్ట్రాల్,ట్రై గ్లిసరైడ్స్ లెవెల్స్ నీ తగ్గిస్తుంది.

యవ్వనంగా కనిపించేలా..
రాగి పాత్రలో నీటిని రెగ్యులర్‌గా తాగుతూ ఉంటే అందులో ఉండే మెలనిన్ వల్ల ముఖం మీద ఫైన్ లైన్స్ రావు. రాగి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *