Amazon Founder Jeff Bezos Planning To Buy NFL Team

నేషనల్ ఫుట్ బాల్ టీమ్ ను కొనుగోలు చేయనున్న అమెజాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మెజాన్ వ్యవస్థాపకుడు,సీఈవో జెఫ్ బెజోస్ నేషనల్ ఫుట్ బాల్ లీగ్(NFL)టీమ్ ను సొంతం చేసుకోవాలని ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. NFL..32 జట్లతో కూడిన ప్రొఫెషనల్ అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్. ఇది నేషనల్ ఫుట్‌బాల్ కాన్ఫరెన్స్,అమెరికన్ ఫుట్‌బాల్ కాన్ఫరెన్స్ మధ్య సమానంగా విభజించబడింది. 

NFL టీమ్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న బెజోస్..పులువరు ప్రస్తుత NLF ఓనర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్‌ పత్రికను సొంతం చేసుకున్న110 బిలియన్ డాలర్లతో  భూమిపై అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ పలుసార్లు వారితో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం.
గురువారం రాత్రి ఫుట్‌బాల్‌ను ప్రసారం చేయడానికి అమెజాన్ ఎన్‌ఎఫ్‌ఎల్‌తో భాగస్వామ్యం పొందింది. వ్యాపార దృక్పథం కింద ఎన్‌ఎఫ్ఎల్ బృందాన్ని అమెజాన్ కొనుగోలు చేయనున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts