Home » 100 బిలియన్ డాలర్ల క్లౌడ్ మార్కెట్లో అమెజాన్ టాప్
Published
2 months agoon
By
sreehariAmazon Cloud Market : ప్రముఖ అమెరికా మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ అమెజాన్ క్లౌడ్ 100 బిలియన్ డాలర్ల క్లౌడ్ మార్కెట్లో అగ్రగ్రామిగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసు ప్రైవైడర్లలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ మార్కెట్ షేర్లతో దూసుకెళ్తోంది.
Synergy Research Group (SRG) అంచనా ప్రకారం.. ఆన్ లైన్ రిటైలర్ ప్రాఫిటబుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాంగా 2020 రెండో త్రైమాసికానికి 33శాతం మార్కెట్ షేర్లతో అమెజాన్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
క్లౌడ్ మార్కెట్లో తన అతిపెద్ద పోటీదారుల మార్కెట్ షేర్లతో కలిపి మొత్తంగా అమెజాన్ ఒక్కటే భారీ మార్కెట్ షేర్లతో ముందంజలో నిలిచింది.
2020 Q2లో ప్రపంచ క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసుల్లో ఒకటైనా అమెజాన్ 30 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. గడిచిన 12 నెలల కాలంలో వార్షికంగా మొత్తం క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసు ఆదాయం మొత్తంగా 111 బిలియన్ డాలర్ల ఆదాయం పెరిగింది. Covid-19 సంక్షోభ సమయంలోనూ క్లౌడ్ మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది.
పబ్లిక్ క్లౌడ్ సర్వీసులకు ప్రధానంగా అనేక ప్రయోజనాలను అందించిందని SRG చీఫ్ ఎనలిస్ట్ John Dinsdale పేర్కొన్నారు. 2020 రెండో త్రైమాసికంలో అమెజాన్ 33 శాతంతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆ తర్వాతి స్థానాల్లో అజూర్ (18శాతం), గూగుల్ క్లౌడ్ (9) శాతం, అలీబాబా క్లౌడ్ (6శాతం), IBM క్లౌడ్ (5శాతం), సేల్స్ ఫోర్స్ క్లౌడ్ (3శాతం), టెన్సంట్ క్లౌడ్ (2శాతం), ఒరాకిల్ క్లౌడ్ (2శాతం)గా నిలిచాయి.