లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

జియో ఫైబర్ యూజర్లకు శుభవార్త : అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉచితం

Published

on

Amazon Prime subscription for Geo Fiber users free for one year

జియో ఫైబర్ యూజర్లకు శుభవార్త. వినియోగదారులకు రూ.999 విలువ చేసే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గోల్డ్, ఆ పై ప్లాన్లు కలిగిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు, అమెజాన్ మ్యూజిక్ కూడా యూజర్లకు ఉచితంగా లభించనుంది. 

జియో ఫైబర్ వాడుతున్న ప్రస్తుత వినియోగదారులు కూడా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. దీని కోసం మీ సెటాప్ బాక్సులో పాత అమెజాన్ అకౌంట్ లో లాగిన్ అవ్వొచ్చు లేదా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. మై జియో యాప్, జియో.కామ్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లు కలిగిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

సిల్వర్, బ్రాంజ్ ప్లాన్లు కలిగిన వారు ఈ ఆఫర్ కావాలంటే గోల్డ్ ప్లాన్ కు అప్ గ్రేడ్ 
అవ్వాల్సి ఉంటుంది. జియో ఫైబర్ గోల్ద్ ప్లాన్ ప్రస్తుతం రూ.1299కి లభిస్తోంది. ఎయిర్ టెల్ సైతం రూ.999 కంటే ఎక్కువ మొత్తం కలిగిన ప్లాన్ పై అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *