అమెజాన్‌లో 5 star రేటింగ్ ఇస్తే క్యాష్‌బ్యాక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రతి ఈ-కామర్స్ సైట్ బాగా సర్వీసు అందించాలని.. కస్టమర్ల నుంచి మంచి రేటింగ్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగానే 5 స్టార్ రేటింగ్ వచ్చిందంటే ఇక పిచ్చ హ్యాపీ. అది సర్వీసు పరంగా వస్తే పర్లేదు కానీ, 5స్టార్ రేటింగ్ ఇవ్వండి క్యాష్ బ్యాక్ గెలుచుకోమంటూ ఆఫర్లు ఇస్తున్నారు అమెజాన్ సెల్లర్లు. ఈ మాత్రం తెలివి నెటిజన్లకు ఉండదా.. వారు ఒకలా రేటింగ్ అడిగితే మరోలా చీప్ అయిపోతారని ఊహించలేదేమో.. ఇలా అడ్డంగా దొరికిపోయారు.

అమెజాన్ సెల్లర్లతో చాటింగ్ చేసిన యూజర్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. రూ.249 విలువైన ప్రొడక్ట్ కు 5సా్టర్లు రేటింగ్ ఇస్తే రూ.100వరకూ క్యాష్ బ్యాక్ పొందొచ్చని అమెజాన్ సెల్లర్ ఆఫర్ చేస్తున్నాడు. అలా చేస్తే ఒకవేళ ప్రొడక్ట్ డ్యామేజ్ చేస్తావా అంటే సరే అని చెప్పగా.. మరో కస్టమర్ కు దాదాపు రూ.100వరకూ క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఆఫర్ చేస్తున్నారు.

నిజమే మరి మనం ఈ కామర్స్ వెబ్ సైట్ లో ప్రొడక్ట్ తో పాటు దానికి ఉన్న రేటింగ్ ను కూడా దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇలా ఫేక్ రేటింగ్, ఫేక్ రివ్యూలతో వస్తువులు అమ్మితే మరోసారి ఆ ప్లాట్ ఫాంను పట్టించుకోమంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే తెలిసిన బ్రాండ్ మాత్రమే కొనుక్కునే కస్టమర్లు కూడా ఫేక్ రేటింగ్ చూసి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కనీస బాధ్యతగా మనం చేయాల్సిందల్లా.. కామన్ గా ప్రొడక్ట్ క్వాలిటీ గురించి జనరల్ ఐడియాతో చేసే కామెంట్లు వదిలేసి వస్తువు వాడితే ఎలాంటి కామెంట్లు రేటింగ్ ఇస్తారో గమనించి వస్తువు కొనుగోలు చేస్తే మంచిది.

Related Posts