లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఏఎంబీలో షోలు పడుతున్నాయ్!

Published

on

AMB Cinemas: మహమ్మారి కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. కోవిడ్ కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా కుదేలైంది. సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. దాదాపు ఎనిమిది నెలల పాటు సినీ కార్మికులే కాదు.. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు.

కోవిడ్‌ పరిస్థితుల నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడిప్పుడే మన స్టార్స్‌, దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. ఇటీవల థియేటర్స్‌ విషయంలోనూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్ని సూచనలు చేస్తూ థియేటర్స్‌ను ఓపెన్‌ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడంతో.. థియేటర్ల దుమ్ము దులుపుతున్నారు యజమానులు..

AMB Cinemas

ఈ నేపథ్యంలో ఏషియన్ గ్రూప్‌తో కలిసి సూపర్‌స్టార్ మహేష్ బాబు నెలకొల్పిన ఏఎంబీ సినిమాస్ డిసెంబర్ 4 నుండి పున:ప్రారంభమవనుంది.
ఈ సందర్భంగా ప్రదర్శించబోయే సినిమాలతో న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ‘టెనెట్’ సినీ ప్రియులను ఆకట్టుకోవడానికి డిసెంబర్ 4 నుండి థియేటర్లలోకి రానుంది. ఏఎంబీలో అత్యధికంగా 12 షోలు వేస్తున్నారు. మరో ఇంగ్లీష్ మూవీ ‘కమ్ ప్లే’ కూడా అదే రోజు రానుంది.

AMB Cinemas

మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, దుల్కర్ సల్మాన్, రీతు వర్మ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’, ఎవర్‌గ్రీన్ మూవీ ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ‘వార్’ వంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *