అత్యంత ప్రభావ శీలురు..Isha, Akash Ambani లను కొనియాడిన Fortune magazine

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Fortune’s all-new 40 Under 40 list: రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లాగానే..తనయులు దూసుకపోతున్నారు. అంబానీ కుమార్తె, కుమారుడు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు అరుదైన ఘనత సాధించారు. ఫార్చూన్ మేగజీన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన ’40 అండర్-40′ జాబితాలో వారికి స్థానం దక్కింది. వారితోపాటు బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ఎదరవుతున్న కొత్త కొత్త సవాళ్లను ఈ యువ ఎగ్జిక్యూటివ్‌లు సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా, తమ ఉద్యోగులను ఉత్సాహ పరుస్తూ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లారని ఫార్చూన్ మేగజీన్ కొనియాడింది.

స్టెరాయిడ్లు తీసుకుంటే Covid-19 నుంచి బయటపడొచ్చట!!


ఈ ఏడాది ఐదు విభాగాలను పరిశీలించి “40 అండర్-40′ జాబితాను ప్రకటించింది. టెక్నాలజీ జాబితాలో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పేర్లు పొందుపరిచింది.ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ పొందిన తర్వాత..2014 లో రిలయన్స్ కంపెనీలో చేరారు. వివిధ యూనివర్సిటీల్లో చదివారు. ఫేస్ బుక్ సంస్థ జియోలో పెట్టుబడి పెట్టే డీల్ ను సమర్థవంతంగా టేకప్ చేశారు. కొన్ని రోజుల క్రితం..ఇషా, ఆకాష్ అంబానీలు జియో మార్ట్ కూడా ప్రారంభించారు.

Related Tags :

Related Posts :