లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

డేటింగ్ యాప్ తో యువకుడ్ని కలవటానికి వెళ్లి చావు తప్పి బైటపడ్డ యువతి

Published

on

America atlanta yong woman dating app Incident : టెక్నాలజీ. ఇప్పుడన్నీ టెక్నాలజీతో నడుస్తున్నాయి. కానీ చాలామంది యువత దాన్ని వాడుకునే విధానంలో సమస్యల్లో పడుతున్నారు. అది తెలిక చేసిందా తెలిసి చేసిందాని పక్కన పెడితే ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న సందర్భాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఓ యువతి చావు తప్పి కన్ను లొట్టబోయి బైటపడింది.సోషల్ మీడియా పెద్ద ఆయుధంగా మారిపోయింది. కొత్త కొత్త పరిచయాలు..సరికొత్త కోణంలో వచ్చే సమస్యలకు కూడా దారి తీస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యువతి, తనకు పరిచమైన ‘‘డేటింగ్ యాప్’’ ద్వారా ఓ కుర్రాడిని కలవడానికి వెళ్లింది. అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రాణాలమీద ఆశలు వదిలేసుకున్న సమయంలో అద్భుతంగా బైటపడింది.


వింతలకే వింత : అన్నీ రెండేసి అవయవాలతో పుట్టిన పిల్లాడు


వివరాల్లోకి వెళితే..అమెరికాలో అట్లాంటాకు చెందిన బ్రిట్నీ కొరేరి అనే యువతి డేటింగ్ యాప్ ద్వారా పరియం అయిన బెంజమిన్ ఫాంచర్ అనే యువకుడిని గత బుధవారం (నవంబర్ 11,2020) కలవటానికి వెళ్లింది. ఇద్దరూ కలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. కాసేపు ఇద్దరూ కలిసి తిరుగుతూ ఒకరి విషయాలు మరొకరు చెప్పుకున్నారు. అలా సరదగా నడుస్తుండగా సడెన్ గా ఆ యువకుడికి ఏమైందో తెలీదుగానీ..ఆమెపై దాడికి దిగాడు. ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నాడు. ఈ హఠాత్పరిణామానికి ఆమె బిత్తరపోయింది.

అతడినుంచి తప్పించుకుందామనుకున్నా సాధ్యంకాలేదు. కొడుతూనే ఉన్నాడు. రక్తం కారేలా ఆమెను దారుణంగాకొట్టాడు. ఆమె మొత్తం శరీరాన్ని దెబ్బలతో హింసిస్తున్నాడు. తప్పించుకోవటానికి చాలా విధాలుగా ప్రయత్నించింది. కానీ అతని భల్లూకపు పట్టునుంచి తప్పించుకోలేకపోయింది. కొట్టీ కొట్టీ ఆఖరికి తుపాకీ తీశాడు. ఆమెకేసి గురిపెట్టాడు. అది చూసిన ఆమెకు పై ప్రాణాలు పైనే పోయాయి.ఇక నా పని అయిపోయినట్లే..అని ప్రాణాలమీద ఆశ వదిలేసుకుంది. చిగురుటాకులా వణికిపోయింది. ఇక చేసేదేమీ లేక మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. ఇదే నా ఆఖరు రోజు అని. అప్పుడే జరిగింది ఓ అద్భుతం. అచ్చం సినిమాలోలాగా.. సరిగ్గా అప్పుడే ఉమెన్ సెక్యూరిటీ అటుగా రావటంతో ఆమె ప్రాణాలతో బైటపడింది.


తనకు జరిగిన ఈ దారుణం గురించి బ్రిట్నీ కొరేరి తన ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.నేను ఎవరి సానుభూతి కోసమో, ప్రశంసల కోసమే ఈ విషయాన్ని చెప్పటంలేదు. నాకు ఎదురైన కిరాతక అనుభవాన్ని అందరూ తెలుసుకుని అప్రమత్తంగా ఉంటారనే ఆశతో చెబుతున్నాని చెప్పింది. ఈ విషయం తెలుసుకుని అందరూ తమ తమ జీవితంలో జాగ్రత్తగా ఉంటారని..ముఖ్యంగా యువతులు..మహిళల కోసం ఇది షేర్ చేస్తున్నానని తెలిపింది.


సినిమాల్లో కథల్లో జరిగే ఇటువంటి ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతాయని, అలాంటి వ్యక్తులు ఉంటారని ఈరోజే నాకు జరిగిన అనుభవం ద్వారా తెలిసిందనీ..కాబట్టి మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరి ముఖ్యంగా తెలియని వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నేను సూచించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *