లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

జో బైడెన్ జీవిత విశేషాలు: కష్టాలు కూలదోస్తున్నా.. పరిస్థితులు వెక్కిరిస్తున్నా

Published

on

america-new-president-joe-bidens

Joe Biden’s life story : బతకడమే భారమని అనుకున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. ఇప్పుడు అమెరికాను ఏలబోతున్నారు. 77ఏళ్ల వయసులో 46వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. అమెరికాలో ఏదో మూలలో సెకండ్ హ్యాండ్ కార్ షోరూం ఓనర్ కొడుకు నుంచి… ప్రెసిడెంట్ వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది ? ఎలాంటి చాలెంజెస్ ఎదుర్కొన్నారు. జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్… జో బైడెన్ అసలు పేరు ఇది! 50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. రెండుసార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా చేసినా… బైడెన్‌ ఎంత పేరు సంపాదించారో తెలియదు గానీ… ట్రంప్‌ను ఎదుర్కొని దేశ విదేశాల్లో ఇప్పుడందరి దృష్టిలో పడ్డారు.

77 ఏళ్ల వయస్సులో : –
77 ఏళ్ళ వయసులో… 46వ అధ్యక్షుడిగా ఇప్పుడు ఆయన వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఎక్కడో సెకండ్ హ్యాండ్ కార్ షోరూం ఓనర్ కొడుకుగా.. చాలీచాలనీ బతుకుల నుంచి ఇప్పుడు శ్వేత సౌధం వరకు.. బైడెన్ ప్రయాణం స్పూర్తిని కలిగిస్తుంది. చూడని కష్టం లేదు.. ఎదుర్కోని నష్టం లేదు.. కళ్లముందే కన్నవాళ్ల మరణాలు.. చావు దాకా వెళ్లొచ్చిన క్షణాలు.. ఒక్కటా రెండా బైడెన్ జీవితాన్ని పరికిస్తే.. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ! అధ్యక్ష పదవిపై బైడెన్‌ మనసు పడటం ఇది మొదటిసారేం కాదు. గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ప్రయత్నం మాత్రం వదల్లేదు.

Joe

మొదటి రెండుసార్లు అవమానాలే : –
అందుకే ముచ్చటగా మూడోసారి గెలిచారు ఆయన. మొదటి రెండుసార్లు అవమానాలే ఎదురయ్యాయి బైడెన్‌కు. 1988లో తొలిసారి 40 ఏళ్ళ కుర్రతనం ఉరకలెత్తుతున్న వేళ… అధ్యక్షుడు కావాలనుకున్నారు. స్పీచ్ కాపీ అనో.. కారణమేదో కానీ ఆ ప్రయత్నం ఫ్లాప్ అయింది. 2008లో మరోమారు బరిలో దిగాలి అనుకుంటే… డెమొక్రటిక్‌ ప్రాథమిక అభ్యర్థిత్వానికే మద్దతు లభించలేదు. అదే సంవత్సరం బైడెన్‌ను ఉపాధ్యక్ష పదవికి ఎంచుకున్నారు ఒబామా. విదేశాంగ వ్యవహారాల్లో పరిష్కారకర్తగా, సలహాదారుగా ఆయన వ్యవహరించారు.

1942లో జననం : –
చిన్నతనం నుంచి.. ఇప్పుడు అధ్యక్ష పదవి వరకు.. బైడెన్ జీవితాన్ని పలకరిస్తే ఎన్నో కష్టాలు కన్నీళ్లు. 1942 నవంబరు 20న ఓ ఐరిష్‌ కాథలిక్‌ కుటుంబంలో పుట్టారు. బైడెన్‌కు ముగ్గురు తోబుట్టువులు. ఆర్థికంగా మొదట్లో కుటుంబం బాగానే ఉన్నా… బైడెన్‌ పుట్టే సమయానికి పరిస్థితి దిగజారింది. దీంతో తాత ఫ్యామిలీ దగ్గరే కుటుంబం గడపాల్సి వచ్చింది. బైడెన్‌ చదువుల్లో అంతంతే గానీ… క్లాసులీడర్‌గా ఉండేవారు. ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌ ఆడేవారు. సిరక్యూస్‌ యూనివర్సిటీ నుంచి 1968లో న్యాయశాస్త్రంలో బెైడెన్ పట్టా పొందారు.
చిన్నప్పుడు బైడెన్ మాట్లాడితే నత్తి వచ్చేది.

Family of Joe

నత్తిని అధిగమించారు : –
దీంతో తోటిపిల్లలు గేలిచేసేవారు.. ఆటపట్టించేవారు. డిప్రెషన్‌తో బాధపడకుండా గంటలకు గంటలు అద్దం ముందు నిలబడి కవితలు చదువుతూ… ఆ నత్తిని అధిగమించారు. అదే ఆయనను గొప్ప ఉపన్యాసకుడిగా మార్చింది. ఇప్పటికీ బైడెన్ మాట తడబడుతున్నట్లు అనిపించినా… చెప్పాలనుకున్నది అందంగా అర్థమయ్యేలా చెప్పగలరు. మధ్యతరగతి నుంచి వచ్చిన బైడెన్‌ స్వయంకృషితో అమెరికాలోని మిలియనీర్ల జాబితాలో చేరారు. పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా చాలా సంపాదించారు. ఒకప్పుడు నత్తితో బాధపడిన కుర్రాడు.. ఆ తర్వాత యూనివర్సిటీలు, కాలేజీల్లో స్పీచ్‌లు ఇచ్చి మోటివేట్ చేసే స్థాయికి ఎదిగారంటే.. బైడెన్ ఏంటో చెప్పడానికి ఇంతమించి ఏముంటుంది ఎగ్జాంపుల్.

46వ అధ్యక్షుడిగా : –
మూడుసార్లు అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసినా.. మొదటి రెండుసార్లు నిరాశే మిగిలింది బైడెన్‌కు. అయినా సరే ఏమాత్రం తనను తాను తక్కువ చేసుకోలేదు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్నట్లుగా ప్రయత్నాలు కొనసాగించారు. ఏళ్ల కలను నిజం చేసుకున్నారు. ఇప్పుడు సగర్వంగా.. ఠీవీగా అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా కలల సౌథం.. వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు బైడెన్. అమెరికన్లు మాత్రమే కాదు.. ప్రపంచం మనసు గెలిచిన అధ్యక్షుడు ఆయన..అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా గెలిచాడంటే.. సంబరం అక్కడే కాదు.. ప్రపంచం మొత్తం రీసౌండ్ ఇస్తోంది.