america-police-tased-and-arrested-a-woman-refusing-to-wear-a-mask-at-a-middle-school-football-game

మాస్క్ పెట్టుకోలేదని మహిళకు కరెంట్ షాక్ ఇచ్చిన పోలీసులు..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

woman refusing to wear a mask:మాస్క్ పెట్టుకోకుండా బైటకొస్తే పోలీసులు ఫైన్లు వేస్తుంటారు. ఇది ప్రజల సేఫ్టీ కోసం. మాస్క్ పెట్టుకోకుంటే రెండు వందలు..లేక ఐదు వందల రూపాయల ఫైన్లు వేయటం గురించి విన్నాం. అరెస్టులు చేసి వింత వింత శిక్షలు వేయటం గురించి కూడా విన్నాం. కానీ మాస్క్ పెట్టుకోలేదని ఓ మహిళకు పోలీసులు ఏకంగా కరెంట్ షాక్ ఇచ్చి హింసించిన ఘటన అమెరికాలో జరిగింది.



అమెరికాలోని ఒహాయో‌లో మాస్క్ పెట్టుకోకుండా ఫుట్‌ బాల్ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఓ మహిళను పట్టుకున్న పోలీసులు ఆమెకు కరెంట్ షాక్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. అలిసియా కిట్స్ అనే మహిళ కుమారుడు మారియెటాలోని ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్ యాజమాన్యం పిల్లలతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిస్తోంది. ఆ మ్యాచ్ లో అలిసియా కొడుకు కూడా పాల్గొన్నాడు. బుధవారం (సెప్టెంబర్23,2020) జరిగే ఆ మ్యాచ్ చూడటానికి అలిసియా మాస్క్ పెట్టుకోకుండా వచ్చింది. కొడుకు ఫుట్‌బాల్ ఆడుతుంటే చూసి మురిసిపోయింది. ఆ సంతోషంలో కొడుకుని ప్రోత్సహించేందుకు తెగ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచింది.


అంతగా చప్పట్లు కొడుతున్న అలిసియాను పోలీసులు చూశారు. ఆమె మాస్క్ పెట్టుకోకపోవటం గమనించారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. దానికి ఆమె అంగీకరించలేదు. రెండు మూడు సార్లు మర్యాదగా చెప్పినా వినలేదు. పైగా పోలీసుల్ని బండ బూతులు తిడుతూ..రెచ్చిపోయింది. ‘‘ఏంటీ మీగోల మధ్యలో నాకొడుకు ఆటను చూడనివ్వకుండా పోండి ఇక్కడ నుంచి‘‘ అంటూ పోలీసులపై అరిచింది.


దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించారు. టేజర్ గన్‌తో ఆమెకు షాక్ ఇచ్చి, చేతులకు బేడీలు వేశారు. ఈ ఘటన ఇప్పుడు అమెరికాలో చర్చనీయంగా మారింది. ఆమెను అరెస్టు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Posts