ప్రజల ముందుకు వచ్చిన ట్రంప్, ఐ యామ్ ఫీలింగ్ గ్రేట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

America President donald trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నారా ? వైరస్ సోకిన తర్వాత.. చికిత్స తీసుకున్న తర్వాత..ట్రంప్ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాన్ లోని వైట్ హౌస్ బాల్కనీలో నిలబడి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.


ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో నిలిచిన ప్రత్యర్థి బైడెన్ పై విమర్శల దాడిని కంటిన్యూ చేశారు ట్రంప్. బైడెన్ అధికారంలోకి వస్తే..గనుక డెమొక్రాటిక్ పార్టీ అమెరికాను సోషలిస్టు దేశంగా మారుస్తారని, నల్ల జాతి, లాటిన్ అమెరికన్లకు డెమొక్రాటిక్ పార్టీ వ్యతిరేకమన్నారు.ఎన్నికల ర్యాలీలో వందల సంఖ్యలో ట్రంప్‌ మద్దతుదారులు పాల్గొన్నారు. ఐ యామ్‌ ఫీలింగ్‌ గ్రేట్‌. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బయటకు వెళ్లి ఓటు వేయండి అంటూ మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైట్ హౌస్ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. వైట్ హౌస్ చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనలో వ్యాధి లక్షణాలు కనిపించలేదు. చికిత్సకు బాగా స్పందించారని వైట్ హౌస్ డాక్టర్ సియాన్‌‌ కాన్లే తెలిపారు. ఇచ్చిన మందుల వల్ల కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తెలిపారు.

Related Tags :

Related Posts :