ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ కు పెద్ద చరిత్ర ఉందని భారతీయ అమెరికన్, ఐక్యరాజ్యసమితి (UN)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకునేంత వరకు ఆ దేశానికి అమెరికా ఒక డాలర్ కూడా ఇవ్వొద్దని చెప్పారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ కు పెద్ద చరిత్ర ఉందని భారతీయ అమెరికన్, ఐక్యరాజ్యసమితి (UN)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకునేంత వరకు ఆ దేశానికి అమెరికా ఒక డాలర్ కూడా ఇవ్వొద్దని చెప్పారు. పాక్ దేశానికి ఆర్థిక సాయం చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరించడాన్నిహేలీ ప్రశంసించారు. అమెరికా భద్రతను పటిష్టపరిచేందుకు ‘స్టాండ్ అమెరికా నౌ’ అనే కొత్త గ్రూపు పాలసీని హేలీ ప్రారంభించారు.
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!
దేశ భద్రత, పబ్లిక్ సేప్టీ, సోషలిజం, అమెరికన్ కల్చర్ వంటి పలు సమస్యలపై దృష్టిసారించేందుకు ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. దేశీయ సమస్యలే కాకుండా చైనా, రష్యా, ఇరాన్ వంటి ప్రమాదకర అంతర్జాతీయ దేశాలపై కూడా ఈ గ్రూపు కన్నేసి ఉంటుంది. ఇతర దేశాలతో పాటు పాక్ దేశానికి అమెరికా ఆర్థిక సాయం చేసినప్పటికీ.. యూఎన్ సమావేశాల్లో ఎన్నో సందర్భాల్లో అమెరికాను పాకిస్థాన్ వ్యతిరేకించినట్టు ఆమె గుర్తు చేశారు.
‘‘2017లో అమెరికా నుంచి పాకిస్థాన్ దాదాపు 1 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం పొందింది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ ఆర్థిక సాయం పొందిన దేశాల్లో పాకిస్థాన్ ఆరో దేశం. ఇందులో పాకిస్థాన్ ఆర్మీకే ఎక్కువ వినియోగించగా, రోడ్లు, హైవేలు, ఎనర్జీ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది’’ అని హేలీ తెలిపారు. ఐరాసలో జరిగిన పలు చర్చల్లో అన్నీ కీలక ఓట్లు అమెరికాను సమర్థిస్తే.. ఒక్క పాకిస్థాన్ 76 సార్లు యూఎస్ ను వ్యతిరేకించిందన్నారు.
Also Read :అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు
అప్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు వెళ్లిన అమెరికా సైనిక దళంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులకు పరోక్షంగా పాక్ సహకరించినట్టు హేలీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాక్ అవలంభిస్తున్న తీరును ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని హేలీ తెలిపారు.
Also Read :1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది
Also Read : దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్